#


Index

కర్మయోగులు - దక్షాదులు

వికృష్యమాణః ప్రసభం - యవనేన బలీయసా తామేవ మనసాగృహ్లన్ బభూవ ప్రమ దోత్తమా

  అనంతరం విదర్భరాజ సింహస్యవేశ్మని కాల కబళితుడై తన ఇల్లాలి రూపాన్నే స్మరిస్తూ తరువాత జన్మలో విదర్భరాజు కుమార్తెయై జన్మిస్తాడు.

“యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తంతమే వైతి"

  అని భగవదను శాసనం. ఏది భావిస్తూ పోతే పురుషడదే అవుతాడు. పూర్ణమైన తత్త్వాన్ని భావిస్తే పురుషోత్తమడవుతాడు. అలాకాక అపూర్ణమైన సంసార భావాలనే భావిస్తూ పోతే అపూర్ణమైన స్త్రీ జన్మే వస్తుంది. తప్పేదేముంది. అదైనా దక్కిందా చివరకు. ఆ జన్మలో కూడా ఒక రాజకుమారుణ్ణి వివాహమాడి "పతిం పర్యచరద్ధిత్వా భోగాన్ సాపతి దేవతా” ఆయన తపస్సు చేస్తుంటే తానూ ఆయనకు పరిచర్య చేస్తూ పోతుంది. చివరకాయన బ్రహ్మ నిర్వాణం పొందినా ఇంకా బ్రతికి ఉన్నాడనే భ్రాంతి పడుతుంది. చివర కాయన ఉపరతుడయ్యాడని తెలుసుకొని ఎంతగానో విలపిస్తుంది. చితి పేర్చుకొని పతి ననుగ మించాలని ఉద్యుక్తురాలవుతుంది. "తత్ర పూర్వతరః కశ్చిత్సఖా బ్రాహ్మణ ఆత్మవాన్" అప్పుడు ప్రత్యక్షమవుతాడొక బ్రాహ్మణుడు. “జానసి కిం సఖాయాం మాం” పూర్వ సఖుణ్ణి నన్ను గుర్తించావా అని అడుగుతాడు. "హంసా వహం చ త్వం చార్యే - సఖాయౌ మానసాయనౌ” మనమిద్దరమూ ఒకప్పుడు మానస సర స్సంచారులమైన రాజహంసలం. "సత్వం విహాయ మా బంధోగతో గ్రామ్యమతి ర్మహీమ్" నన్ను వదిలేసి హఠాత్తుగా నీవీ భూమి మీద వాలాలని దుర్బుద్ధి పుట్టి వాలిపోయావు. వాలి అంత కంతకీ సాంసార వాగురలో చిక్కి సోలిపోయావు. ఒక్కసారి జరిగినదంతా జ్ఞాపకం చేసుకోమంటాడు.

ఏవం సమానసో హంసో - హంసేన ప్రతిబోధితః స్వస్థస్త ద్వ్యభిచారేణ - నష్టా మావపునః స్మృతిమ్

  అనే సరి కాహంస మాటలతో అంత కాలం నుంచీ తన్నలము కొన్న మైకం దిగిపోయి స్వస్థత చెంది సంసార వ్యాసంగంతో కోలుపోయిన పూర్వస్మృతిని మరలా పొంద గలిగాడట పురంజనుడు. ఇదే గురూపదేశమంటే. ఆ వచ్చిన హంస ఒక

Page 205

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు