భావన దూరం చేసుకొని నేను కర్మాచరణ దక్షుడను గదా అని అహంకరించి ముందుకు పోతే ఫలితం లేకపోగా పరాభవం పాలవుతాడు మానవుడు. ఇదీ దీని తాత్పర్యం.
ఈ దక్షుడింతటితో ఆగలేదు. ఇంకా ఒక ఘనకార్యం చేశాడు జీవితంలో. నారద మహర్షిలాంటివాడికి శాపమిచ్చాడీ మహానుభావుడు. కేవల ప్రవృత్తి మార్గంలో చిక్కి దిక్కు తెలియక చెడిపోయే ప్రాణికోటికి మోక్షమార్గం చెప్పి ఉద్దరించటమే ఆయన వ్రతం. దక్షుడీశ్వరానుగ్రహంతో బ్రతికిన తరువాత అయుత సంఖ్యాకులైన పుత్రులను కన్నాడు. ప్రజాసృష్టి చేయవలసిందని వారిని నియోగించాడు. వారికెందుకో పారమ హంస్యమైన ధర్మంలోనే మనసులు ప్రసరించసాగాయి. అది కనిపెట్టి నారదుడు వచ్చి వారికి నివృత్తి ధర్మాన్ని నూఱిపోశాడు. వారది బాగా ఒంట బట్టి "ప్రయయు స్తంపరి క్రమ్యపంథాన మని వర్తకమ్” పునరావృత్తి రహితమైన పరమ పదాన్ని పోయి చేరారు. అది తెలిసి దక్షుడు చాలా బాధపడి మరలా ఒక వేయిమంది కుమారులను శబలాశ్వులనే వారి నుత్పాదించాడు. వారిని కూడా నారదుడలాగే బోధించి నివృత్తి మార్గానికి పంపుతాడు. దానికి దక్షుడు ఆగ్రహోదగ్రుడై
అహో అసాధో సాధూనాం - సాధు లింగేన నస్త్వయా అసాధ్వకా ర్యర్భకాణాం - భిక్షో ర్మార్గః ప్రదర్శితః
ఓరి దుర్మార్గుడా - సాధువేషంతో వచ్చి అసాధువులైన మాటలు చెప్పి అర్భకులకు సన్న్యాస ధర్మాన్ని బోధించి నన్ను బాధిస్తావా
ఋణైస్త్రిభి రముక్తానా మ మీమాంసిత కర్మణాం విఘాతః శ్రేయసః పాప-లోక యోరుభయోః కృతః
గృహస్థులుగా ఉండి ఋణత్రయం తీర్చకుండానే వారిని పరివ్రాజకులుగా మార్చి ఇహ పరాలకు దూరం చేశావు. “తస్మాల్లోకేషు తే మూఢ నభ వేదమతః పదమ్” నీకీ పదునాలుగు లోకాలలో ఎక్కడా నిలకడ ఉండబోదు. కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతూ పోతావు పొమ్మని శాపమిస్తాడు. దానికి నారదుడు కించిత్తు కూడా చలించలేదు.
Page 200