#


Index


పురాణములు-వాటి విశిష్టత

మనలాంటి ప్రాకృతమైన బుద్ధులు కావు. కాబట్టి ఆ ఎత్తులకు పోయి వారు దర్శించి చెప్పిన విషయమిక పౌరుషేయం కాదు. అపౌరుషేయమే కావలసి ఉంది. అదే ఈ ఋగ్వేదాదికమైన వేద వాఙ్మయం.

  అపౌరుషేయమైన ఈ వేదం మనకు బోధించే సత్యాలు రెండు. మొదటిది ధర్మం. రెండవది బ్రహ్మం. ఇవి రెండూ మానవుడి జీవితానికి అన్నివిధాలా వాంఛనీయం. కాబట్టి వీటికి పురుషార్థాలని పేరు వచ్చింది. ఇవిగాక మరి రెండు కూడా ఉన్నాయి పురుషార్థాలు, అర్థం కామమనేవి. అవి జీవిత కాలం వరకేగాని అనంతరం పనికివచ్చేవి కావు. జీవితంలోనే గాక తరువాత కూడా ఉపకరించేవి ముందుదాహరించినవి రెండే. ఇవి ప్రేయస్సైతే అవి మన పాలిటికి శ్రేయస్సు. తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తుంది ప్రేయస్సు. శ్రేయస్సు శాశ్వతికమైన సుఖాన్నే ప్రసాదిస్తుంది. అయితే మనమూ మన జీవితమూ, రెండూ శాశ్వతం కావే. అనుభవించే సుఖం శాశ్వతమెలా కాగలదని ప్రశ్న రావచ్చు. జీవితమంటే మనకు కనిపించే ఈ వర్తమాన జీవితమేగాదు. దీనికి ముందూ వెనకా కూడా ఉంది జీవితం. దానిననుభవించటానికి జీవులమైన మనమూ ఉన్నాము. ఇటూ అటూ లేకుండా ఏదీగానీ మధ్యలో మాత్రమే ఉండబోదు. ఉన్నదంటే అంతకు ముందది ఏమిటి ఆ తరువాత ఏమిటని ప్రశ్న వస్తుంది. ఏదీకాదంటే అభావంలో నుంచి వచ్చి అది మరలా అభావంలోనికి పోయిందని చెప్పవలసివస్తుంది. అది ఆధ్యాత్మికం దేవుడెఱుగు ఆధి భౌతిక శాస్త్రానికే విరుద్ధం. కాబట్టి దేహానికతిరిక్తంగా జీవుడూ, జన్మ కతిరిక్తంగా జన్మాంతరమూ, లోకాని కతిరిక్తంగా లోకాంతరమూ ఒప్పుకోక తప్పదు. ఒప్పు కొన్నప్పుడంతకంతకు ఉత్తమమైన జన్మ ఎత్తి ఉత్తమ లోకాలలో ఉత్తమ భోగాలను భవించాలంటే జీవుడు శాస్త్రనిషిద్ధమైన అధర్మాన్ని దూరం చేసుకొని విహితమైన ధర్మాన్ని మాత్రమే పాటిస్తూ పోవాలి. దానివల్ల అభ్యుదయమనే ఫలితం కలుగుతుంది మానవుడికి. ఇదే ధర్మమనే పురుషార్ధం మూలంగా మనకు లభించే శ్రేయస్సు.

  పోతే శ్రేయస్పైనా ఇది కూడా సాపేక్షమేగాని నిరపేక్షమైన శ్రేయస్సుగాదు. తరువాత ఏమిటనే ప్రశ్నకు చోటిచ్చినంతవరకూ అది సాపేక్షమే. ఆ ప్రశ్న భేదమనేది ఉన్నపుడే ఏర్పడుతుంది. జీవుడూ, శరీరమూ, జన్మ కర్మా, లోకమూ, లోకాంతరమూ అన్నప్పుడే అది భేదం. ఇలాంటి భేదమున్నదాకా తన్మూలంగా కలిగే శ్రేయస్సు

Page 20

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు