1.పురాణములు-వాటి విశిష్టత
సృష్టిలో మానవుడొక్కడే బుద్ధి జీవి. దాని బలంతో అతడు శోధించి కూడబెట్టిన జ్ఞాన ధనమింతా అంతా గాదు. అది అనంతమైనది. నాటి శ్రుతుల దగ్గరి నుంచీ నేటి కావ్యాలదాకా విస్తరించి ఉన్న వాఙ్మయమే ఆ ధనం. శాఖోపశాఖలుగా కనిపించే ఈ వాఙ్మయానికంతటికీ మూలం మాత్రమాశ్రుతి చతుష్టయమే. ఋగ్యజు స్సామాథర్వణాలనే ఆ నాలుగు శ్రుతులకూ అపౌరుషేయమని అభిజ్ఞులు పెట్టిన పేరు. పురుష బుద్ధిజన్యం కానిదేదో అది అపౌరుషేయం. బుద్ధి జన్యం కాకుండానే ఎలా అవతరించిందని ఆశ్చర్య పడనక్కరలేదు. బుద్ధి అనేది రెండు విధాలు. ఒకటి ప్రాకృతం. మరొకటి సంస్కృతం. ప్రకృతి గుణాలకు లోబడి ఆ మేరకే నడిచేది ప్రాకృతం. ప్రస్తుతం మన బోంట్లకున్న బుద్ధులన్నీ ఇలాంటివే. మనవే గాదు. మనలో గొప్ప కళాకారులూ-శాస్త్రకారులూ అనుకొన్న పెద్దల బుద్ధులు కూడా ప్రాకృతాలే. ఎందుకంటే ఏ మేధావంతుడి కెలాటి ఆలోచన వచ్చినా అది పాంచ భౌతికమైన పరిధి నతిక్రమించి పోయేదికాదు.
అలా పోగలిగతే ఇక అది ప్రాకృతం కాదు. అప్పుడా బుద్ధికి సంస్కృతమని పేరు. ఇది గుణాతీతమైనది. కాబట్టి దానికి త్రిగుణాత్మకమైన సృష్టి రహస్యమంతా కరతలామలకంగా గోచరిస్తుంది. ఒక పట్టణమెంత ఉందో ఎలా ఉందో చూడాలంటే మన మావీథీ, ఈ వీథీ తిరుగుతూ పోతే సుఖంలేదు. దగ్గరలో ఉండే ఒక కొండపైకి ఎక్కిగాని, ఒక విమానంలో కొంత పైకి పోయిగాని, క్రిందికి చూచామంటే సకలమూ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దేశ కాలాదులైన ప్రకృతి గుణాల హద్దులలో మెలగుతూనే ప్రకృతి రహస్యాన్ని భేదించలేము. అలా భేదించి తెలుసుకోవాలంటే ఆ హద్దులను కూడా అతిక్రమించి పోవాలి మన బుద్ధి. అప్పుడది వర్తమానంతో పాటు అతీతా నాగత సత్యాలను కూడా ఆకళించుకోగలదు. దీనికే క్రాంత దర్శనమని వ్యవహారం. ఇలాటి దర్శనం గలవారే మన ప్రాచీనులైన మహర్షులు. వారివి
Page 19