#


Index


ప్రతిష్ఠాపన

  కనుకనే మనం కూడా ఈ సన్నివేశమేమిటిలా ఉంది. ఈ వ్యక్తి జీవితమేమిటింత అశ్లీలం ఇదేమి టింత అసహజం అని ఆక్షేపణ చేయరాదు. అలాగే ఈ కల్పన చూడు ఎంత బాగుందో, ఈ వర్ణన చూడు, ఎంత మనోజ్ఞమో అని వంది మాగధులలాగా కైవారమూ చేయరాదు. ఇదంతా అకించిత్కరమూ, అనభిప్రేతమూ మహర్షికి. లోకానికి హితా హిత వివేక జ్ఞానముపదేశించటానికిది ఒక వ్యాజం మాత్రమే Pretext నని గదా పేర్కొన్నాము. అది ఆయన చూపయినప్పుడా చూపు సడలకుండానే చూడాలి మనం కూడా ఈ ద్వాదశస్కంధ సమ్మితమైన పురాణ సంహితనంతా, అలాటి పావనోదారమైన చూపుతోనే చూచి నేనీ పురాణ హృదయాన్ని ఆవిష్కరించటానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. హరివంశాన్ని వ్యాఖ్యానిస్తూ నీల కంఠుడొక భేషైన మాట అన్నాడు.

  టీకాంత రాణీందు రవి ప్రభాణి, బాహ్యార్ధ రత్నాని చకాసయంతు అంతరిగూఢార్థచయ ప్రకాశే, దీప:క్షమో భారత మందిరే 2 స్మిన్ బాహ్యార్ధాలను మాత్రమే బయట పెట్టే వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి లోకంలో. కాని నా వ్యాఖ్యానమలాంటిది కాదు. ఇది అంతరాంతరాల్లో దాగి ఉన్న భావ రత్నాలను ప్రకాశింపజేసే భావదీపమని చాటుతాడు. అంత పెద్దరికం నాకుందని కాదుగాని నేనూ అలాటి మేధాసంపన్నుల మార్గంలో ఆలోచన సాగిస్తూ చేసిన నిర్మాణమిది. నిజానికి నేను గాదీ సామ్రాజ్య నిర్మాతను. నా హృదయాంతరాళంలో నిత్యమూ చోటు చేసుకొని ఉన్న ఆ శ్రీధర నీలకంఠ పోతనాది పురాణ వ్యాఖ్యాతలే. వారి కరుణా కటాక్ష వీక్షాబల నిర్మితమే ఈ భాగవత మహా సామ్రాజ్యం. పోతన మహాకవి చెప్పినట్టు మనమంతా నిజమైన రసిక భావ విదులమైతే ఆ సామ్రాజ్య పదవిని తప్పకుండా అందుకోగలమని హామీ ఇస్తున్నాను

Page 18

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు