#


Index


ప్రతిష్ఠాపన

  సన్నివేశాలూ, దాని ఆభాసే ఈ కలాపమంతా. చిత్ర విచిత్రమైన పోకడలతో కనిపించే ఈ పరికరాలన్నింటినీ ఒక ఆలంబనంగా చేసుకొని ఈ బృహద్ధరణంలో ఆ ఏకైకమైన విశ్వ సత్యాన్ని వీక్షించి ఆ వెలుగులో మీ జీవితాలు సరిదిద్దుకొమని చెప్పటానికే మహర్షులు చేసిన ఈ మంచి చెడ్డల గారడీ అంతా. ఇందులో ముందు చెప్పినట్టు మంచి అనులోమంగా చేసిన బోధ అయితే చెడ్డ ప్రతిలోమంగా చేసిన బోధ.

  ఇలాంటివీ వారు సాధించిన సౌందర్య ప్రబోధాలు Beauty and Sublimity ఇవి తమ అపారమైన సాహితీ సృష్టి ద్వారా అప్రయత్నంగా అతిసహజంగా సాధించి చూపారు వ్యాస వాల్మీకి ప్రభృతులైన మహర్షులు. వారి అడుగుజాడలలోనే పయనిస్తూ అంత విశాలమైన సృష్టి గాకున్నా చాలా వరకా కోవనందుకొని మనకలాంటి విజ్ఞాన సంస్కారాలే అందించారు కాళిదాసాది మహాకవులు. అపారమైన ఆసౌందర్య ప్రబోధాలనంతగా అందుకోలేక తత్తన్మాత్ర సంతృప్తులయ్యారు ఆ తరువాతి కాలంలో వచ్చిన కవులు, ఆ పిమ్మట కాలానుగుణంగా విలువలు దిగజాఱి దానికి కూడా నోచుకోని కవులు పరభాగ్యోప జీవులయి బ్రతుకుతూ వచ్చారు. ఈ ప్రకారంగా పురాణ కవులకున్న ఏ ఉదాత్త విశాలమైన దృష్టి ఉందో అది రాగా రాగా తరువాతి కవులందరికీ తగ్గుతూ వచ్చింది. కనుకనే వారు మహాకవులైతే వీరంతా కేవలం కవులు మాత్రమే. అదైనా ఆ దృష్టి కొంతకు కొంత ఉండటం మూలాన్నే. అసలే దానివాసన లేకపోతే వాడు కవి శబ్దవాచ్యుడే కాడు. ఒక వ్రాయసకాడు మాత్రమే.

  మొత్తం మీద అలాటి ఒక మహాకవీ, మహర్షీ కావించిన వరమాద్భుతమైన సాహిత్య సృష్టి ఈ భాగవతం. తత్త్వ పారమ్యాన్ని రమ్యమైన కథా వస్తువుతో, పాత్రలతో వారి ప్రవృత్తులతో మేళవించి ఒక మధురమైన రసాయనంలాగా అందించాడు మనకు బాదరాయణుడు. వెనుక చెప్పినట్టు కథలూ, వర్ణనలూ, కావాయన వివక్షితం Intension. "విజ్ఞాన వైరాగ్య వివక్షయా" అని ఆయనే స్వయంగా చాటాడు లోకానికి. అనిత్యమూ, అసుఖమూ అయిన ఈ బాహ్య జగద్వ్యవహారం నుంచి విముఖుణ్ణి చేసి అంతకంతకు మానవుణ్ణి పరమపదంలో పట్టాభిషిక్తుణ్ణి చేయాలనే మహర్షి సంకల్పం. అందుకోసమల్లినదే ఈ కథాజాలమంతా

Page 17

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు