#


Index

అనన్యభక్త

వస్త్రాపహరణాదులైన మహోపద్రవాల నెన్నిటి నుంచో వారిని కాపాడాడా మహానుభావుడు. పాంచాలీ కబరీ వికర్షణంతోనే ఆయుః క్షయాన్ని పొందిన ధార్త రాష్ట్రులను పాండవులు కాదు వాస్తవంలో చంపింది. చంపించిన వాడు తాను. రాజసూ యాశ్వమేధాలు నిర్విఘ్నంగా చేయగలిగింది వారు కాదు. వారిచేత చేయించింది తాను. మరి లోకంలో చివరస్థాయి అయిన కీర్తి గడించింది వారు గాదు. అది వారికి తెచ్చిపెట్టింది తాను. ఇదంతా ఎంతో ప్రేమ వారిమీద ఉంటేగాని పరమాత్మ ఇలా వారికి తోడ్పడే వాడు కాదు.

  కాగా ఇక అన్నీ అయిన తరువాత ఆఖరిది భక్తి. ఇది నారద మహర్షి అనన్య భక్తి. దీనికి ముందు వర్ణించినవన్నీ సగుణభక్తి విశేషాలు. ఒకటి కామ గుణం. ఒకటి భయగుణం. ఒకటి వైరగుణం. ఒకటి సంబంధ గుణం. మరొకటి ప్రేమ గుణం. ఈ గుణాలేవీ కాని నిర్గుణం నారదభక్తి. ఆ నిర్గుణ భక్తి అలవడాలంటే దానికి ముందీ సగుణభక్తి పాకానికి రావాలి. అదిపాకానికి వస్తే ఈశ్వరీయమైన జ్ఞానముదయిస్తుంది. అప్పుడు భజించేదీ భజింపబడేదీ రెండూ ఒకే ఒక తత్త్వం గదా అనే అఖండ భావన కది దారి తీస్తుంది. ఆ భావనే నిర్గుణానికి ప్రాణం. కాబట్టి నిర్గుణరూపమైన అనన్యభక్తికి జ్ఞానమైతే జ్ఞానానికి సగుణభక్తి సాధనమవుతుంది. ఈ సగుణంలో మరలా భూమికా క్రమమున్నది. సగుణంలో వైరమొక్కటీ ప్రతిలోమమైతే మిగతా కామాదులన్నీ అనులోమం. అనులోమంలో నవభూమికలు ఉన్నాయి. ఆ తొమ్మిదింటినీ ప్రహ్లాదుడి ముఖతః బయట పెడుతున్నది భాగవతం. "శ్రవణం కీర్తనమ్ విష్ణోః స్మరణమ్ పాద సేవనమ్ అర్చనమ్ వందనమ్ దాస్యమ్ సఖ్య మాత్మ నివేదనమ్” శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ఇవి ఆ తొమ్మిది భూమికలూ. బాగా గమనిస్తే ఈ క్రమంలో ఉత్తరోత్తరమూ ఉత్కర్ష కనిపిస్తుంది. మొట్టమొదట భగవద్గుణాలను శ్రవణం చేస్తాడు సాధకుడు. తరువాత వాటినే వాచా కీర్తిస్తాడు. దానివల్ల మనసులో ఆ ఈశ్వరుడి తాలూకు స్మృతి ఏర్పడుతుంది. తదనుగుణంగా శరీరంతో సేవిస్తాడు. కరద్వయంతో అర్చిస్తాడు. శిరస్సుతో నమస్కరిస్తాడు. ఇదే దాస్యానికీ ఆ దాస్యం క్రమంగా సఖ్యానికీ దారి తీస్తుంది. దాస్యంలో సేవ్య సేవక భావముంటే సఖ్యంలో అలాటి భావం బాగా తగ్గిపోయి అభేద బుద్ధి ఏర్పడుతుంది. అది చివరకాత్మ

Page 194

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు