#


Index

అనన్యభక్త

  వైతే ఎవరివాడవు-ఎవడవు. నీ నివాసమేమిటి. అవన్నీ మానవుడికైతే ఉంటాయి గాని పరమాత్మకు నీకెక్కడివి. ఇలాంటి మహానుభావుడివి నీ పాటికి నీవే దయ చేశావంటే నా జన్మా వంశమూ కూడా సఫలమయినాయి. యజ్ఞపురుషుడవు నీ రాకతోనే జేసే ఈ యజ్ఞంకూడా ఫలితమిస్తుంది. ఇంతకూ నా కోరికలన్నీ కడతేరాయి. ఇక నేనున్నా లేకున్నా ఫరవాలేదు. అని రాబోయే విషయం ముందుగా తెలిసే అన్నాడా అనిపిస్తుంది. మరి దీనికి తగినట్టే ఉంది భగవానుడి సమాధానం. ఇది నాకు నెలవని ఏరీతి పలుకుదు- ఒక చోటనక యెందు నుండనేర్తు పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుందీ మాట. ఎవ్వరి వాడనం చేమని నుడువుదు నాయంత వాడవై నడవ నేర్తు ఆయన అసంగిత్వాన్ని చెబుతుందిది. ఈ నడవడి యని యెట్లు వక్కాణింతు - పూని ముప్పోకల బోవుచుందు అగుణుడై కూడా త్రిగుణాత్మకంగా భాసించే లక్షణాన్ని చాటుతుందిది. అది నేర్తు నిది నేర్తునని యేల చెప్పంగ - నేరుపులన్నియు నేన నేర్తు- సర్వ స్వతంత్రుడని చెప్పటాని కుదాహరణ. ఒంటివాడ జుట్టమొకడు లేడు-ఏకమే వాద్వితీయమనే భావానికీ నిదర్శనం. సిరియు తొల్లిగలదు-విభూతి తనలోనే గలదనేందుకు తార్కాణం. చెప్పెద నా టెంకి సుజను లందు తఱుచు సొచ్చియుందు- సర్వగతుడనైనా సాధువులకే దర్శనమిస్తానని భావం.

  భగవత్తత్త్వావ బోధకమైన వర్ణనలలో ఇంత చమత్కారకమూ భావ గంభీరమూ అయిన వర్ణన మరొకటి మనభాషలో ఉండబోదు. ఇంతకూ భగవంతుడి మీద వైరం సాగించే రాక్షస ప్రకృతులలో కూడా ఇంతటి భక్తి భావమిమిడి ఉందంటే ఇక మిగతా సాత్త్విక రాజసభక్తుల మాట చెప్పేదేముంది. రాక్షసుల ఇలాంటి అర్ధాంతర స్ఫూర్తినిచ్చే సంభాషణలు సంస్కృత భాగవతంలో చాలా తక్కువ. ఒక్క శిశుపాలుడి మాటలలోనే కొంచెం కనిపిస్తుంది. మిగతా చోట్ల కానరాదు. ఆ మాటలలోని ఆంతర్యాన్ని పట్టి చూచిన ఆంధ్ర మహాకవి పరమ భాగవతుడు గనుక ఎక్కడెక్కడ అలాటి సందర్భాలు వచ్చినా బీరు పోనీయకుండా అదే బాణిలో నడుపుతూ వచ్చాడు.

  వైరభక్తి అయిన తరువాత సంబంధ భక్తి. సంబంధులై వృష్ణులందరూ భజించారట. యదు వృష్టి భోజాంధక కుకురు అని యాదవులంతా అయిదు శాఖలు. వృష్టి అనేది అందులో ఒకశాఖ. అయినా ఆ మాట ఇక్కడ మిగతా నాలుగిటికీ ఉపలక్షణం. అయిదూ కలిసి వస్తాయందులో. కృష్ణుడి వంశంలో పుట్టటమే ఒక

Page 192

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు