మానమంటే పరిమాణం. మర్యాద అంటే హద్దు. అవి ఉంటే అప్రమేయుడెలా అవుతాడు - అనంతుడెలా అవుతాడు. ఎంత సాభిప్రాయమైన పలుకులో చూడండి. కాలయవనుడు కూడా ఇలాగే సంబోధిస్తాడు.
“బలిమిన్ మాధవ నేడు నిన్ను భువన ప్రఖ్యాతిగా బట్టెదన్ జలముల్ సొచ్చిన భూమి క్రింద జనినన్ శైలంబుపై నెక్కినన్ బలిదండన్ విలసిల్లినన్ వికృత రూపంబున్ ప్రవేశించినన్ జలధిం దాటిన నగ్రజన్మ హలికా శ్వాటాకృతుల్ దాల్చినన్”
పైకి పంతంగా మాటాడుతున్న ఈ మాటలలో భగవానుడి దశావతార ప్రశంస చూడండి ఎలా తొంగి చూస్తున్నదో. భూమి క్రింద జనటం వరాహావతారమైతే శైలంబుపై నెక్కటం కూర్మావతారం. శైలంబుపై అంటే శైలంమీద తానని కాదిక్కడ. శైలమే తనమీద నని అర్థం. ఇలాగే హిరణ్యకశిపుడి మాటలలో కూడా భగవదవతార ప్రస్తావన వస్తుంది. “భుజ శక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగు గాక" ఇది మత్స్యం. "అలయించి పెనగు నాయచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన నిచ్చుగాక" ఇది కూర్మం. ఇందులో అచల సంభ్రమమూ, వెన్నివ్వటమూ, ఎంత మధురమైన శ్లేషలో చెప్పలేము. "జగడంబు సైపక సౌకర్య కాంక్షియై యిల క్రిందనేగిన నేగు గాక" వరాహం. ఇంకా ప్రౌఢమైన పదప్రయోగం. “క్రోధించి యటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక" కొంత పౌరుషమట హరి అట నారసింహం.
ఇలా పగ సాధించే ఆయా దానవుల మాటలలో కూడా వారి వారి భగవద్భక్తి ఉట్టిపడుతూనే ఉంటుంది. వారి భక్తికి మెచ్చి తల ఊచినట్టు భగవంతుడు వారితో ఆడే మాటలు కూడా అంత సుకుమారంగా సాకూతంగానే కనిపిస్తాయి. బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడిచ్చే సమాధానాలు చూడండి ఎంత మనోహరంగా ఉన్నవో.
“వడుగా ఎవ్వరివాడ వెవ్వడవు సంవాస స్థలం బెయ్యది య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి - నిమఖము యోగ్యంబయ్యె - నా కోరికల్ గడతేయెన్" అంటాడు బలి. నిజంగా నీవు వడుగువేనా. వడుగు
Page 191