#


Index

అనన్యభక్త

దూరే హరి కథా మృతాత్" ఎంతగా నీకు ఔపనిషధమైన జ్ఞానమబ్బినా ప్రయోజనం లేదు. “నైష్కర్మ్యమ ప్యచ్యుత భావ వర్ణితమ్ న శోభతే జ్ఞాన మలమ్ నిరంజనమ్” నైష్కర్మ్య లక్షణమైన జ్ఞానమెంత అలవడినా అచ్యుతమైన స్థితికి రానంతవరకూ అది కూడా ఫలితమివ్వదు. అలాగే సమాధియోగం కూడా స్వతంత్రంగా మోక్షాన్ని సాధించలేదు. “తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః శ్రోతవ్యః కీర్తి తవ్య శ్చ ధ్యేయః" మనసు నేకాగ్రం చేయటం వరకే గాదు. ఆ ఏకాగ్రమైన సమాహితమైన మనసుతో ధ్యానించవలసిన దొకటున్నది. అది సర్వాత్మకమైన భగవత్తత్త్వమని అర్ధం చేసుకోవాలి. అలాగే సగుణభక్తి కూడా దానిపాటికది ఉపయోగపడదు.

“అకామ స్సర్వ కామోవా మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరమ్”

  అకామ-సకామ అనే మాటల్లో సగుణ భక్తులంతా కలిసి వస్తారు. వారికి భక్తి ఉంటే ఉండవచ్చు గాని తావన్మాత్ర పర్యవసాయి అయితే ప్రయోజనం లేదు. అది తీవ్రమైన భక్తి కావాలి. ఆ భక్తి అనన్యభక్తిగా పరిణమించాలి. అప్పుడే సగుణంగా కాక నిర్గుణంగా భావిస్తారా పరమాత్మను. పరమ్ పురుషమంటే నిర్గుణమైన పరిపూర్ణమైన తత్త్వమని భావం.

  కాబట్టి కర్మ భక్తి జ్ఞానాలు మూడూ దేనిపాటికది స్వతంత్రంగా ముక్తిదాయకాలు కానేకావు. కాగా అవన్నీ యథోచితంగా అనన్యభక్తికి దారి తీసిన నాడు తద్వారా ఫలితమిస్తాయి. అదే ఈ క్రింది వాక్యాలలో నిర్దేశిస్తున్నది భాగవతం.

యోగేన వివిధాంగేన - ధర్మేణోభయ భిన్నేన ఆత్మ తత్త్వావ బోధేన- వైరాగ్యేణ దృఢనచ ప్రావోచమ్ భక్తి యోగస్య స్వరూపమే చతుర్విధమ్

  యమనియమాదులైన అష్టాంగాలతో కూడిన సమాధి యోగమూ, ధర్మాపర పర్యాయమైన కర్మయోగమూ, సగుణ రూపమైన భక్తియోగమూ, ఆత్మావబోధ రూపమైన జ్ఞానయోగమూ, ఈ కలాపమంతా యోగభూమికలే. ఈ భూమికా క్రమాన్నే చిలవలు, పలవలు పెట్టి ఇలా వర్ణిస్తున్నాడు శ్రీధరాచార్యుడు.

Page 180

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు