#


Index

అనన్యభక్త

సరిదిద్దుకొని మరలా దగ్గర పడతాము. అది అజ్ఞానంవల్లనైతే ఇదిజ్ఞానం వల్ల సాధించవలసి ఉంది. ఈ సాధనకే భక్తి అని పేరు.

  భాగవతుడికీ భగవంతుడికీ మధ్య ఒక పెద్ద వంతెన లాంటిదీ భక్తి. వంతెన ఇద్దరినీ అద్దరినీ కలిపి నట్టిక్కడ భగవద్భాగవతుల నిద్దరినీ కలుపుతుంది ఈ భక్తి అనే వంతెన. అయితే ఇందులో నాలుగంతుస్తులున్నాయి ఈ మార్గంలో, భజించటమనేది అంతా ఒకటిగాదు. భజించటమంటే పట్టుకోటమని గదా అర్థం చెప్పాము. అది ఒకటిగాదు. నాలుగు. తెలియక పట్టుకోటమొకటి. తెలిసీ తెలియక పట్టుకోవటమొకటి. తెలిసి అంతగా పట్టకపోవటమొకటి. తెలిసి బాగా పట్టుకోవటమొకటి. వీటిలో మొదటిది కర్మయోగం. రెండవది భక్తియోగం. మూడవది జ్ఞానయోగం. నాలుగవది పూర్ణజ్ఞాన యోగం లేదా అనన్య భక్తి యోగం. మొదటి రెండింటిలో భజించటమైతే ఉందిగాని దానికి కావలసిన జ్ఞానం లేదు. కొంత జ్ఞానమున్నా అది సమ్యగ్ జ్ఞానం కాదు. మూడవదానిలో సమ్యగ్ జ్ఞానమనేది ఉంది. కాని ఆ జ్ఞానంలో నిలకడలేదు. శాస్త్ర శ్రవణాదుల వల్ల మనసులో ఒక నిశ్చయ జ్ఞానం కలిగింది. అది కేవలం మానసికమే. మానసికమైన ఆ జ్ఞానం బాహ్య జీవితంలో కూడా ప్రతిఫలించి ప్రతిక్షణమూ దాన్ని విడవకుండా పట్టుకోవాలి. ఇలాంటి పట్టుకే నిష్ఠ అని పేరు. ఈ నిష్ఠ అనేది మూడవదానిలో లేదు. కేవల జ్ఞానం మాత్రమే ఉంటుంది. పోతే నాలుగవదానిలో ఈ జ్ఞానం పరిపాకానికి వచ్చి నిష్ఠగా మారుతుంది. అందుకే దీని కనన్యమని పేరు. అన్యం లేనిదేదో అది అనన్యం. అన్యమేమిటి. విజాతీయమైన భావం. దేనికి విజాతీయం. ఆత్మచైతన్యానికి. మన ఆత్మకుండే విజాతీయాలు రెండే. ఒకటి ఈ కనిపించే ప్రపంచం. మరొకటి ఎక్కడో కనిపించకుండా ఉండే ఈశ్వరుడు. ఇటు జగత్తును గాని అటు ఈశ్వరుణ్ణిగాని రెండింటినీ మనకు వేరుగా భావించరాదు. రెండూ మన ఆత్మస్వరూపంగానే అనుసంధానం చేసుకోవాలి. అప్పుడిక మన చైతన్యాని కన్యమైన పదార్థమే ఉండబోదు సృష్టిలో. సర్వమూ ఆత్మే. సర్వానికీ ఆత్మే. ఇలాటి సర్వాత్మభావం నిరంతరమూ నిలిచి ఉంటే అదే జ్ఞాన నిష్ఠ లేదా అనన్యభక్తి.

  ఇలాటి అనన్య భక్తాభాగవతం మనకు ప్రతిపాదిస్తూ ఉన్న భక్తి. ఒక్క భాగవతమే గాక విష్ణు పురాణాదులు కూడా దీనినే బలపరుస్తున్నాయి. “ఏవం సర్వేషు భూతేషు భక్తి రవ్యభి చారిణీ - కర్తవ్యా పండితైర్జాత్వా”

Page 176

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు