పట్టుకోవాలంటే సామాన్యం కాదు. లోకసామాన్యమైన బుద్ధులతో లోకాతిశాయి అయిన ఆ తత్త్వాన్ని గ్రహించలేము. అది ఏమిటో దానినెలా గ్రహించాలో లోకానికి బోధించటానికే మహర్షి భాగవతారంభంలోనే ఈ పద్య పంచకాన్ని రచించాడు. భాగవత సౌధాంతః ప్రవేశానికిది ముఖద్వారం లాంటిది. దీనిద్వారా పోతేనే భగవత్స్వరూపాన్ని మనం దర్శించగలం. భాగవత పురాణ రహస్యమంతా అసలీ అయిదు పద్యాలలోనే గుంభితమయి ఉంది. భగవదవతార తత్త్వమంతా ఇందులోనే గర్భితమయి ఉంది. దీని నర్ధం చేసుకొని ఇదే ఒక కరదీపికగా చేత పట్టుకొని లోపల ప్రవేశించినవాడు పురాణ ప్రాసాదంలో ఆయా కక్ష్యాంతరాలు గడచిపోయి క్షేమంగా వచ్చి బయటపడగలడు. లేదా వాడి పాలిటికది ఒక మయసభలాగా మారిపోయి ఉన్నది లేనట్టూ లేనిదున్నట్టూ దృగ్రమ గొలిపి దిగ్రమకే దారి తీస్తుంది. దానితో అసలు భాగవతమూ అర్థం కాదు. భగవదవతారాలూ అర్ధంకావు. అన్నిటికన్నా కృష్ణావతారమూ దాని లీలలూ అసలే అంతుపట్టే వ్యవహారం కాదు. ఎప్పటికైనా విబుధులైన జనులవలన వినికని తెలుసుకొన్నవాడే అన్నిటినీ భేదించి తెలుసుకోగలడు. తెలుసుకొని తరించగలడు.
Page 174