నామరూపాలనే ఎప్పుడూ తగిలి వర్తిస్తుంటాయి. వాటి కతీతమైన తత్త్వాన్ని అవి ఎలా భావించగలవు. పట్టుకోగలవు. ఇది ఎలాటిదంటే ఆకాశంలో ఒక పక్షి ఎగిరిపోతుంటే దాని నీడ క్రింద నేలమీద కనిపిస్తుంది మనకు. ఈ నీడ పక్షికాదు. అసలు పక్షి నేలమీద లేదు అది ఎక్కడో దీనికతీతంగా నింగిలో ఎగురుతుంది. దాని నీడ మాత్రమే ఈ నేలపైనకనిపిస్తుంది. దానిలాగా దీనికీ ఒక ఆకారముంది. దానిలాగానే ఇదీ వేగంగా పోతూంది. అయినా ఇదే వాస్తవమైన పక్షి అనుకొంటే పొరబాటు. వాస్తవమైన దాని ఛాయ. ఆభాస మాత్రమే ఇది. అలాగే వాస్తవమైన తత్త్వం త్రిగుణాత్మకమైన జగత్తు కతీతంగా ఉంటే దాని లీల లేదా నీడ మాత్రమే లోకంలో అది ప్రదర్శించే చేష్టలన్నీ. వాటిద్వారా అసలు దాన్ని పట్టుకోవాలేగాని మానవుడా చేష్టలమేరకే చూచి అవే నిజమని భావించరాదు.
అయినా మనమలా భావిస్తున్నామంటే దానికి కారణం మన మనస్సే. అది
నామరూపాలనే వలలో తగులుకొన్న చిలక. దానికి తోడు పోయినదే వచస్సు.
మాట. మనస్సును బట్టే వచస్సు. ఒకదానితో ఆలోచిస్తాము. మరొక దానితో
ఆవిష్కరిస్తాము. అయితే ఎంత ఆలోచించినా ఆవిష్కరించినా ఇదంతా మన తార్కిక
చాతుర్యం మాత్రమే. ఎంతో గొప్పగానే ఉండవచ్చు మన హేతువాదం. దానికెన్నో
దృష్టాంతాలు తోడు చేసుకొని చూపవచ్చు. అయినా అది కుతర్కమే గాని సుతర్కం
కాదు. కారణమేమంటే నామరూపాల సరిహద్దులు దాటిపోవటం లేదది. దేశ
కాలాదులైన మేరలను దాటి అనంతంగా వ్యాపించి ఉన్న తత్త్వాన్ని దేశ కాలాదుల
మేరలోకి దించి చూపటానికే ప్రయత్నిస్తుంది. అది శుష్కతర్కం గాక శుద్ధతర్కమెలా
అవుతుంది. శుద్ధమైన తర్కమే కావాలంటే మానవుడు తన బుద్ధి బలంతో సాగించేది
కారాదది. శ్రుత్యనుగృహీత మయినది Supported by Intution కావాలి. ఏమిటది.
సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ - నేహ నానాస్తి కించన - అనే
నిష్ప్రపంచ బ్రహ్మాత్మ తత్త్వాని కనుగుణంగా సాగే ఆలోచన. అలాటి ఆలోచనాపరుడే
ప్రాజ్ఞుడు. మిగతా వారందరూ అజ్ఞులే. అజ్ఞుడంటే అద్వితీయాత్మ తత్త్వం
తెలియనివాడు. వాడెప్పటికీ ఆ భగవత్తత్త్వాన్ని అర్ధం చేసుకోలేడు. "అజ్ఞశ్చా శ్రద్ధ
ధానశ్చ సంశయాత్మా వినశ్యతి" అన్నారు. చేసుకోనంతవరకూ వాడు లోకంలో
ఉన్నా లేనివాడే. వాడి జీవితమంతా నిరర్థకమే. తత్త్వాన్ని దానిస్థాయి కెదిగి
Page 169