కేవలమొక మాయా విలాసమేనని అర్ధం చేసుకోవాలి మనం. దీనితో ఆయన కంటగట్టిన జారత్వాది దోషాలెగిరిపోతాయి. అంతేకాదు. ఇంద్రియానుభవాలన్నప్పుడు సుఖమే కాదు. దుఃఖం కూడా. కనుక చివరకాయనకు కలిగిన బాణప్రహారమూ, ప్రాణప్రహాణమూ ఇవి కూడా ఒక నటనేనని గ్రహించవలసి ఉంటుంది.
అయితే అంతా నటనే అంతా మాయామయమేనని తీర్మానించటానికేమిటి సబబు. అది కేవలం మన స్వకపోల కల్పనేమో. కాదని చెప్పటాని కాధారమేమిటి మనకని ఒక ఆశంక చేయవచ్చు. దానికి పరిహారం చెబుతున్నాడు.
నచాస్య కశ్చిన్ని పుణేన ధాతు రవైతి జంతుః కుమనీష ఊతీః నామాని రూపాణి మనో వచోభిః సంతన్వ తోనట చర్యామి వాజ్ఞః
జగదధి నాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్ తగిలి మనోవచో గతుల తార్కిక చాతురి యెంత గల్గియున్ మిగిలి కుతర్కవాది తగు మేరలు చేసి యెఱుంగ నేర్చునే యగణిత నర్తనక్రమము నజ్ఞుడెఱిగి నుతింపనోవునే
ఈ జగత్తనే దున్నదంటే ఇది దానిపాటికది ఆవిర్భవించలేదు. దీని ఆవిర్భావానికి మరేదో కారణమై ఉండాలి. అది మరలా దీనిలోనిదే అయితే సుఖంలేదు. దీని లక్షణాలకు విలక్షణమై దీని కతీతమైనదయి ఉండాలి. జగదధి నాథుడంటే అదీ అర్థం. ఇది పాంచభౌతికమైతే ఈ జగత్తు. దీని కధి అభౌతికమైన శుద్ధ చైతన్య రూపమది. అలాంటి ఆ హరితత్త్వమేదో అది మనకు గ్రహణ గోచరం కాదు. కారణమది ఈ జగత్తు కతీతమైన భూమికలో ఉంది. పోతే మనబోటి జీవుల మీ జగత్తు కధీనమైన స్థితిలో ఉన్నాము. మనమున్నది దేశకాల వస్తువులనే త్రిపరిచ్ఛేదాల కధీనమయిన దశ. మరి ఆ తత్త్వమో తురీయమైన దశ. అంచేత దాని అసలు రూపమేమిటో మనకు తెలియదు. అది మనకెప్పుడూ మరుగుపడే ఉంటుంది. పోతే మనకు కనిపించేవి కేవలం దాని లీలలే. అవీ కంటికి నామరూపాత్మకంగానే కనిపిస్తాయి గాని భగవద్విభూతిగా అనుభవానికి రావు. ఎంచేత. మన మనస్సులు
Page 168