#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

అది అక్కడ ఉందనా చేసిందనా. ఏదీ లేదు. అది ఒక కనుకట్టు. అలాటి కనుకట్టే మనకీ జగత్సృష్టి.

  పోతే మనమీదనే ఈ కనుకట్టు పనిచేసేది. సృష్టించిన ఆయననంటదది. కనుకనే ఆయన దానిలో మునగడు. మనలను ముంచుతుంటాడు. మరి ఆయన పరిస్థితేమిటి. ఎక్కడ ఉన్నాడు. ఎక్కడో లేడు మరలా. ఈ సృష్టి అయిన చరాచర భూతాలలోనే నిండి ఉన్నాడు. అలా ఉన్నా మనలాగా అస్వతంత్రుడు కాదు. సర్వ స్వతంత్రుడు. తానేమి చేసేదీ తనకు తెలుసు. అచ్చమైన ఆ తెలివితోనే పంచేంద్రియాలకూ, మనసుకూ చెందిన అన్ని సుఖాలూ అనుభవించగలడాయన. మనమూ అలాగే అనుభవిస్తున్నాము గదా అని ప్రశ్నించరాదు మరలా. మనం మన స్వరూపమే మరచి అనుభవిస్తాము. ఆయన శుద్ధ చైతన్యరూపుడు కాబట్టి ఆకాశంలాగా దూరదూరంగానే ఉండి అనుభవిస్తాడు. ఆకాశమిప్పుడంతటా ఉంది. అన్నింటి లోపలా వెలపలా వ్యాపించి కూడా అమూర్తం కాబట్టి అది దేనినీ అంటదు. దానినేదీ అంటదు. అలాగే అమూర్తమైన ఆత్మతత్త్వం కూడా సుఖదుఃఖాది భోగాల మధ్యే మెలగుతున్నా అదీ వాటినంటి ముట్టదు. అలాంటప్పుడిక బంధమేముంది. ఇంద్రియాలకు చిక్కదది. పైగా ఆ ఇంద్రియాలనే బంధించి తన ఇచ్ఛానుసారంగా త్రిప్పుతూ పోతుంది. అధోక్షజుడూ హృషీకేశుడని పరమాత్మకు పేరు వచ్చింది ఇందుకే. అక్షములంటే ఇంద్రియాలు. హృషీకమన్నా ఇంద్రియమే. వాటి జ్ఞానాన్ని అధఃకరించిన వాడూ వాటిని వశీకరించుకొన్నవాడూ గనుక ఆయన అధోక్షజుడూ, హృషీకేశుడూ అయ్యాడు. దీని మూలంగా మనం గ్రహించవలసిన రహస్యమేమిటి. కృష్ణుడవతరించి నప్పటినుంచీ నిర్యాణమయ్యేదాకా కనిపించిన ఆ నీలమేఘ శ్యామలమైన ఆకార మసలు వాస్తవంలో అక్కడ లేనేలేదు. అమూర్తమైన తత్త్వం మూర్తమెలా అయింది. అయిందంటే అది మాయామయమే యథార్థం కాదన్నమాట. కనుకనే “మాయై షాహి మయా సృష్టా యన్మాం పశ్యసి నారద” నారదా ! నీవు చూస్తున్నది నా నిజస్వరూపం కాదు. అది మాయ. అని చెప్పగలిగాడు నారదుడి కాయన. కాగా ఇక శరీరధారణమే మాయ అయినప్పుడాయన ఆ శరీరంతో చేసిన అనుభవించిన ఇంద్రియ భోగాలు మాత్రం సత్యమెలా అవుతాయి. అవీ మాయే. అంటే అప్పటికి గోపికలతోడి రాసక్రీడాదులూ, పదహారు వేలమందిని పరిణయమాడటాలూ, ఇవన్నీ

Page 167

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు