అలాంటప్పుడు కృష్ణుడిక దేవకీ వసుదేవులకు జన్మించటమూ వట్టిదే. ఆయన చేసిన కంసవధాది కార్యాలూ వట్టిదే.
అంతా వట్టిదే అయితే మరి ఈ లోకాలన్నిటినీ ఎవడు సృష్టించాడు. ఈ జీవుల నెవడు సృష్టించాడు. ధర్మసంస్థాపన కోసమని ఈ అవతారాలన్నీ ఎవడు ధరించాడు. అంతా వట్టిదని కొట్టివేస్తే మరివన్నీ కొన్ని గాకపోయినా కొన్నైనా కనిపిస్తున్నాయి గదా. అనుభవాన్ని ఎలా కాదనగలం. అని ప్రశ్న వస్తుంది. దానికి సమాధానమిస్తున్నాడు.
"సవా ఇదం విశ్వ మమోఘ లీలః సృజత్యవ త్యత్తి - న సజ్జతే 2 స్మిన్ భూతేషు చాంతర్హిత ఆత్మ తంత్రః షాడ్వర్గికం జిఘ్రతి షడ్గుణేశః”
భువన శ్రేణి నమోఘ లీలు డగుచుం బుట్టించు రక్షించు - నం త విధింజేయు - మునుంగడందు - బహుభూతవ్రా త మం దాత్మతం త్ర విహార స్థితుడై – షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్ దివి భంగిం గొను – చిక్కడింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్
ఈ లోకాలన్నీ సృష్టించిన మాట వాస్తవమే. అయితే ఎలా సృష్టించాడని మీరను కోవటం. ఒక కుమ్మరి కుండలు సృష్టించినట్టనా. కాదు. కుమ్మరి కంటే ఒక మట్టి అనే ఉపాదానం కావాలి. దండ చక్రాదులనే సహకారులు కావాలి. తనకు కరచరణా ద్యవయవాలూ పని చేయాలి. ఇలాటి కలాపమేదీలేదా ఈశ్వరుడికి. ఉన్న వాడాయన ఒక్కడే. ఉపాదానమయినా తానే సహకారి అయినా తానే. మరి సర్వవ్యాపకుడూ జ్ఞానైకరూపుడూ కాబట్టి తనకొక శరీరమంటూ లేదు. అలాంటివాడు ఎలా సృష్టిస్తాడీ బ్రహ్మాండ భాండాలను. అదే వింత. ఏదీ లేకపోయినా ఒకటున్న దాయనకు. అదే ఆయనతో ఏకీభూతమై ఉన్న మాయాశక్తి. "పరాస్యశక్తి ర్వివిధైవ శ్రూయతే” అది ఆయన ఇచ్ఛను బట్టి ఎలా కావలిస్తే అలా మారిపోగలదు. అలాటి మాయాశక్తి విలాసమే ఈ భువన శ్రేణినంతా పుట్టిస్తున్నది. పెంచుతున్నది. త్రుంచుతున్నది. పెంచుతున్నా, త్రుంచుతున్నా అది వాస్తవంలో మరలా పెంచటమూ కాదు, త్రుంచటమూ కాదు. అది ఒక లీల. అమోఘమైన లీల. ఐంద్రజాలికుడి లీలలాటిది. ఉన్నట్టుండి ఆకాశంలో గంధర్వనగరం లాంటిది కల్పిస్తాడొక ఐంద్రజాలికుడు
Page 166