వచ్చాడు జీవితంలో వాగ్రూపంగా నైతే జీవితానంతరం మౌనరూపంగా. నిర్యాణం జీవితం కంటే ఇంకా బలంగా ప్రభావం చూపింది ఆశ్రితుల స్వభావం మీద.
అయితే ఇదంతా మన వ్యామోహమే గాని అసలు పరమాత్మ జీవించటమేమిటి. మరణించటమేమిటి. ఆ మాటకు వస్తే అసలాయన జన్మించనే లేదు. జన్మ లేనపుడిక జీవితమూ నిర్యాణమనే మాటలకర్థమే లేదు. అజుడు, అచ్యుతుడూ అయిన వాడెలా జన్మిస్తాడని. జన్మించకనే పోతే దుష్ట శిక్షణాది కర్మమెలా చేస్తాడని. రెండూ అబద్ధమే. కనుకనే భాగవతావ తరణంలోనే ఇలా వ్రాస్తున్నాడు వ్యాస భగవానుడు.
ఏవం జన్మాని కర్మాణి - హ్యకర్తు రజన స్యచ వర్ణ యంతిస్మ కవయో - వేదగుహ్యాని హృత్పతేః
జననము లేక కర్మముల జాడల బోక సమస్త చిత్తవ ర్తనుడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మ కర్మము ల్వినుతులు సేయుచుండుదురు - వేద రహస్యములందు నెందు జూ చిన మఱి లేవు జీవునకు జెప్పిన కైవడి జన్మ కర్మముల్
జన్మ కర్మ అనేవి భగవానుడి కెప్పుడూ లేవు. ఉండటానికి వీలు లేదు. ఆయన అజుడూ, అవ్యయుడూ పైగా సమస్త చిత్తవర్తనుడైన చక్రి ఆయన. “యః పృథివ్యామ్ తిష్ఠన్” అని చాటుతుంది అంతర్యామి బ్రాహ్మణం. గీత కూడా చెబుతుంది. “ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దేశే 2ర్జున తిష్ఠతి" అని అన్నింటిలోనూ ఉండి అన్నింటి లోపలా వెలపలా వ్యాపించి వాటన్నిటనీ త్రిప్పుతూ ఉన్నదదే అయె. చక్రి అనే మాట ఎంతో సార్ధకంగా ప్రయోగించాడు మహాకవి. భ్రామయన్ సర్వభూతాని అన్నప్పుడు చక్రంలాగా త్రిప్పేవాడనే గదా అర్థం. అలాంటి సర్వవ్యాపకుడూ సర్వాత్మకుడూ అయిన వాడెలా జన్మిస్తాడని. అయితే రామకృష్ణా ద్యవతారా లెత్తాడని చెప్పటమేమిటి. ఎత్తాడని చెబుతున్నదెవరు. వేదవ్యాసాదులైన కవులు. కవీశ్వరులు కాబట్టి గొప్ప గొప్ప వర్ణనలు చేస్తూ వచ్చారు పుట్టాడని చేశాడని. అవి వారి పొగడ్తలే గాని నిజంలో పరమాత్మ పుట్టాలేదు, చేయాలేదు. శాస్త్రంలో ఎక్కడ ఏ వాక్యం తడవి చూచినా జీవుడికి లాగే దేవుడికి జన్మాదులు లేవనే మనకు చాటుతుంది. జీవుడికే లేనప్పుడిక నిత్యముక్తుడైన ఈశ్వరుడికి చెప్పటం హాస్యాస్పదం
Page 165