#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

వినాశము న్నెఱపి ఈ భూభారముం బాపి నిశ్చల వృత్తింగృతకార్యుడై చనియె” ఆయన తాను చేయవలసిన కార్యమొకటే ఒకటున్నది. అది ఈ భూభారాన్ని పాపటం. భారమేమిటి. పాపటమేమిటి. భార మధర్మ విజృంభణ. దాన్ని పాపటమంటే ధర్మ ప్రతిష్ఠాపనమే. అది దుష్టశక్తులను శిక్షించటమూ, శిష్టులను రక్షించటం ద్వారానే జరగవలసి ఉంది. అలాగే జరిపాడు వెళ్ళాడా సర్వేశ్వరుండచ్యుతుండలఘుం డేమిని చెప్పుదున్ అంతా భగవదా యత్తమే మన ప్రజ్ఞ ఏమీలేదని ఆక్రందన చేస్తాడు.

  నిజంగా పాండవుల ప్రమేయమేమీ లేదు. 'కర్తా కారాయితా చైవ' అన్నట్టు అంతా ఆ పరమేశ్వరుడే. ఊరక వారు నిమిత్తమాత్రులే. అందుకే “చంచద్గర్వుల ధార్త రాష్ట్రుల ననిం జంపించి గోవిందు డిప్పించెన్ రాజ్య” మని చెప్పటం. చంపించిందీ ఇప్పించిందీ ఆయనే. చివరకు మూడశ్వమేధ యాగాలు చేయించి పాండవుల కఖండమైన కీర్తిని కల్పించింది కూడా ఆయనే. ఇప్పించె, కల్పించె అనే క్రియాపదాలే చెబుతున్నాయి అంతా కృష్ణగారడే, పాండవుల పరాక్రమమేమీ లేదని. పాండవుల పరాక్రమమే అయితే అభిమన్యుడి ప్రాణాలు పోకుండా కాపాడుకోలేరా. పరీక్షిత్తు పిండాన్ని రక్షించలేరా. భగవంతుడుపేక్షించిన వాణ్ణి ఎవరు గానీ రక్షించలేరు. రక్షించదలచిన వాణ్ణి ఎవరు గానీ శిక్షించలేరు. ఇవి రెండూ ఈ రెండు ఘట్టాలలో చూడనే చూచారు పాండవులు. చివర కవసానంలో అన్నిటికి దాఖలా చూడగలిగారు. ఇక చేయవలసినదేముంది జీవితంలో. "సంసార మేవం నిస్సారమ్ దృష్ట్వాసార దిదృక్షయా ప్రవ్రజంతః” అన్న అభియుక్తోక్తి ననుసరించి మహావైరాగ్యంతో ఇక మహాప్రస్థానం చేయటమొక్కటే మిగిలి ఉంది. అంతకుముందే యదువంశ విధ్వంసమూ కృష్ణ నిర్యాణమూ రెండూ విని వారి తల్లి కుంతి మార్గాన్ని అవలంబించి కృష్ణ ధ్యానం చేస్తూ తనువు చాలించింది. మహాభక్తుడు విదురుడు తీర్థ యాత్రాగతుడైన వాడా వార్త మైత్రేయుని వల్ల ఆలించి యోగమార్గంతో తనువు చాలించాడు. ఇందరికి నేర్పిన వైరాగ్యం పాండవులకు మాత్రం నేర్పక పోతుందా భగవన్నిర్యాణ వార్త. వారూ ద్వాపర నిర్గ మనమూ కలియుగాగ మనమూ అప్పుడే చూసి మనసులో రోసి దారి తీశారు ప్రస్థానానికి. ఎవరికి వారు 'యచ్ఛేద్వాజ్మనసీ' అన్న రీతిలో యోగ సమాధిగతులై ప్రాణత్యాగం చేశారు. ఇంతకూ జీవిత కాలంలోనే కాక పరమాత్మ నిర్యాణానంతరం కూడా తన ఆశ్రితులకు జ్ఞానవైరాగ్యాల నుపదేశిస్తూనే

Page 164

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు