సమాధానమిస్తున్నాడొకడు అని. ఒకే ఒక చైతన్యమయినప్పుడది ఇక జీవుడేమిటి దేవుడేమిటి. జీవేశ్వరులనేది మన భ్రాంతి. ఈ భ్రాంతికి మూలం మనదగ్గరే ఉంది. అది మాన ధనం. దేహాత్మాభిమానమని అర్థం. అది ఒక ధనంలాగా దాచుకొని ఉన్నాము మనం జీవితాంతమూ. అందుకే మనం గోపికలం. అది మనం వదులుకోనంత దనుకా ఆ తత్త్వమిక్కడే ఉన్నా ఎక్కడో దాగి ఉన్నట్టే మన కదృశ్యం. అది మరలా దృశ్యం కావాలంటే ఈ సృష్టిలో కనిపించే ప్రతి పదార్థాన్నీ అడుగుతూ పోవాలి మానవుడు. అడిగితే ఈ నామరూపాత్మకమైన పదార్థాలన్నీ వాడి సృష్టే కాబట్టి ఫలానా అని వాడి స్వరూపాన్ని మనకు మౌనభాషలో సూచిస్తాయి. అయితే ఈ భాషను భేదించి తెలుసుకోగలిగి ఉండాలా తత్త్వ రహస్యాన్ని. లేకుంటే అది అక్కడే ఉన్నా మనకు తెర మరుగే.
చూడండి. ఎంత గంభీరమైన భావమో. పైకి ఆధిభౌతికంగా కనిపిస్తున్నా లోపల ఆధ్యాత్మికమైన తత్త్వమెలా ప్రవహిస్తున్నదో. ఇంకా చమత్కార మేమంటే మహాకవి కలం నుంచి ఇలాంటి పద్యమే మరొకటి వెలువడింది. పదజాలంతో సహా ఎత్తుగడతో సహా ఇలాగే నడుస్తుంది చాలా వరకది. ఇది కృష్ణవర్ణన అయితే అది రామవర్ణన. రామకృష్ణుల కుండే తేడా తెలిసేలాగా సాగిన వర్ణన అది. నల్లనివాడు పద్మ నయనంబుల వాడు. రాముడూ నల్లనివాడే. పద్మ నయనముల వాడే. నల్లని వాడంటే రూపంలోనే కాదు. గుణంలో కూడా. నల్ల అంటే మంచి అని కూడా అర్థముంది. చాలా మంచి గుణాలున్నవాడు. మానవోత్తముడని గదా రాముణ్ణి వర్ణించారు పెద్దలు. పద్మనయనుడు కూడా ఆయన. పద్మ నయనుడంటే సూర్యుడని కూడా అనుకోవచ్చు. ఉజ్జ్వలమైన సూర్యవంశంలో జన్మించాడు రాముడు. మహా శుగంబులున్ విల్లును దాల్చువాడు. తన అభిజాత్యానికి తన గుణగణాలకూ తగినట్టు ధనుర్భాణాలు ధరించాడు. క్షాత్రధర్మాన్ని సూచిస్తుందీ మాట. దుష్టనిగ్రహం చేసి ప్రజలకు క్షేమకరంగా పరిపాలన సాగించటమే గదా ఉత్తమ క్షత్రియులు పాటించవలసిన కర్తవ్యం. కడు విప్పగు వక్షము వాడు. అయితే దానికి తగిన బలపరాక్రమాలు కూడా ఉండాలి క్షత్రియుడికి. “వ్యూడోరస్కో వృషస్కంధః" అన్నట్టు అలాంటి శరీర సౌష్ఠవం కూడా అలవడిన వాడని భావం. నిక్కిన భుజంబుల వాడని చెప్పటం కూడా దీనికి సూచకమే. మేలుపై జల్లెడు వాడనటంలో శిష్ట
Page 159