#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

దానినెంతగానో శోధించి పట్టుకొని మనకొక పద్యంలో బయటపెట్టాడు. ఉన్నట్టుండి అంతర్హితుడైన కృష్ణుడెటు వెళ్లాడో ఎక్కడ దాగాడో దిక్కు తెలియక ఓపికలు కోలుపోయిన గోపికలీచెట్టూ ఆ పుట్టా పట్టుకొని మొరపెట్టే పద్యమది.

"నల్లనివాడు - పద్మ నయనంబుల వాడు - కృపారసంబుపై జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు - నవ్వు రా జిల్లెడు మోము వాడొకడు - చెల్వల మానధనంబు దెచ్చె - నో మల్లియలార ! మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే”

  ఇది ఒక దొంగను వర్ణిస్తున్నదో పరమాత్మను వర్ణిస్తున్నదో ఏమైనదీ తెలియని చాలా చిత్రమైన పద్యం. నల్లని వాడన్నప్పుడు దొంగే వాడు. దొంగ మొగం నలుపని కూడా అంటారు లోకులు. కాకపోయినా నల్లని ముసుగు వేసుకొని తిరుగుతాడు గదా దొంగ. రాత్రి అంతా మేలుకొని ఉంటాడు కాబట్టి వాడి నయనాలు పద్మాల లాగానే ఎఱ్ఱబారి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఎవరైనా మేలుకొంటే ప్రమాదమని వారు మత్తుగా పడిపోవటానికి ఏదో రసచూర్ణం వారిపైన చల్లటం కూడా సహజమే. అంతేగాక గారడీ వాడిలాగా ఒక నెమలి పింఛం కూడా కళ్లమీద అటూ ఇటూ తిప్పి కనుకట్టు చేసే దొంగలు కూడా కొందరుంటారు. మరి దొంగఱికం చేసి కూడా ఏమీ చేయనట్టు తెల్లవారి నలుగురిలో నవ్వుముగం పెట్టి నిర్భయంగా తిరిగినా ఆశ్చర్యం లేదు. లేదా దొంగిలించిన ధనం ఎక్కడో దాచి ఏ పొద మాటునో దాక్కొని కూచున్నా కూచోవచ్చు. పైగా ఒకడట వాడు. ఒకడంటే ఎవడో ఒకడు. వాడు ఫలానా అని గుర్తించలేని వ్యక్తి. దొంగ మనకు నేను ఫలానా అని చెప్పి చేస్తాడా దొంగతనం. ఎప్పుడూ వాడు మనకంతుపట్టనివాడే. ఇవన్నీ దొంగ లక్షణాలే. ఒకటి కూడా దొర లక్షణాలు లేవిందులో. అందుకే తమ ధనం యావత్తూ కోల్పోయిన ఆ యువతులు బాధపడుతున్నారు. మీరైనా చూచి ఉంటే వాడి జాడ తెలిపి మమ్మల్ను కాపాడమని ఓ మల్లియలారా అని వాపోతున్నారు.

  ఇది గోపికల వాపోవటం కాదు. భగవత్తత్వాన్వేషణ పరాయణుడైన ఒక సాధకుడి ఆక్రందన. ఆధ్యాత్మికమైన భావాన్ని అధిభౌతికమైన భూమికలో మరుగుపరిచి చెప్పాడు మహాకవి. అది భేదించగలిగితే దొంగ లక్షణాలుగా భాసించేవన్నీ నిజంలో

Page 157

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు