సకల జంతులందు సంచరించు నా మహాత్మునకు పరాంగన లెవ్వరు సర్వమయుడు గాన సలిపె లీల" ఇది అన్నిటికీ కలిపి ఇచ్చే సమాధానం.
మొదటి నుంచీ శ్రీకృష్ణ లీలలన్నీ ఈ ఆధ్యాత్మిక రహస్య భావనతోనే సాగుతూ వచ్చాయి. వాటి నలాగే సమర్థిస్తూ వచ్చాడు పురాణ ముని. గోపికా వస్త్రాపహరణ మేమిటి లేకుంటే. సర్వేశ్వరుడు చేశాడు కాబట్టి సరిపోయింది గాని మరొకడైతే అది ఒక రౌడీ చేష్ట అనవలసిందే గదా. తన సర్వేశ్వరత్వాన్ని వారికి తెలపటానికే చేశాడా పని కృష్ణుడు. కృష్ణుడంటే కర్షించేవాడు - లాగివేశేవాడని అర్ధం. ఏమిటా లాగవలసింది. మానవులకున్న దేహాత్మాభిమానం. అది ఉన్నంత వరకూ మనం గోపికలమే. గోపాయితు మిచ్ఛతీతి గోపికా అని శబ్ద వ్యుత్పత్తి. తన్ను దాచుకోవాలని ప్రయత్నించటమే గోపనం. అలా గోపనం చేసుకొనేది గోపిక. అంటే దేహాభిమానమున్న జీవుడు. వాడికి దేహమే ఆత్మ అనే భావముంది. కనుక దానికి బాహ్యమైనదంతా వాడికి వ్యతిరిక్తమే. వ్యతిరిక్త మెప్పుడయిందో అప్పుడది తన్ను చూస్తుందేమోనని భయం. “యావద్ధి భయ మధ్యస్థో 2 నిత్యమాత్మానమ్ మన్యతే – తావద్దోపాయితు మిచ్ఛత్యా త్మానమ్" ఎంతదాకా ఈ అనిత్యమైన ఆత్మనే చూస్తూ భయ మధ్యస్థుడై ఉంటాడో అంతదాకా తన రూపాన్ని కప్పి పుచ్చుకోవాలనే చూస్తాడు జీవుడు. “యదాతు నిత్య మద్వైత మాత్మానమ్ విజానాతి” నిత్యమైన అద్వయాత్మ స్వరూపాన్ని ఎప్పుడర్థం చేసుకొంటాడో "తదాకః కిమ్ కుతోవా గోపాయితు మిచ్చేత్" అప్పుడెవడు దేన్ని దేని నుంచి దాచుకోవాలని కోరుతాడు. అని ఈ ఆధ్యాత్మిక భావాన్ని అద్భుతంగా వివరించారు భగవత్పాదులు.
ఇదుగో గోపికల వ్యవహారం కూడా ఇదే. వారి వస్త్రాల నపహరించాడు కృష్ణుడంటే అవి వస్త్రాలు కావు. వారి దేహాత్మాభిమానాలే. అవే వస్త్రాల మాదిరి వారిని కప్పి ఉన్నాయి. దానితో వారు తాము వేరు పరమాత్మ వేరనే భావంతో ఆయా దేవతల పూజలూ, వ్రతాలూ చేసి ఏదో సాధిద్దామని యత్నిస్తున్నారు. అది వృథా ప్రయాస దానిలో సిద్ధిలేదని తెలపటానికే వస్త్రాపకర్షణం చేశాడు కృష్ణుడు. వారు బయటికి వచ్చి ప్రాధేయపడితే గాని ఇవ్వనంటాడు. అంటే దేహాభిమానం వదులుకొని సర్వమూ నేననే అద్వైతాత్మ భావంతో చూచినప్పుడే ఇస్తాను - అప్పుడీ వస్త్రాలు ధరించినా వాటితో తాదాత్మ్యముండదు కాబట్టి ఫరవాలేదని భావం. కనుకనే
Page 155