#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

గురి అయింది లోకంలో. ఇది భాగవతం భగవంతుడి చరిత్ర అని కూడా చూడకుండా ఎవరికి తోచినట్టు వారు చాలా తేలికగా మాటాడుతున్నారు. మరి నాస్తికులనూ హేతువాదులనైతే అసలు మనం పట్టనేలేము. ఇంత గాలి దుమారం దీనిమీద లేచినట్టు మరి దేనిమీదా లేవలేదు. సకల కల్యాణ గుణసంపన్నుడూ సర్వలోకా దర్శభూతుడూ అయిన భగవంతుడేమిటి - పరస్త్రీ లోలుడయి అహోరాత్రాలూ వారితో యధేచ్ఛగా క్రీడించటమేమిటి. అది మనమెంతో పవిత్రమైన కథా వస్తువుగా కనుల కద్దు కోవటమేమిటని వీరి ఆక్షేపణ. ఆ మాటకు వస్తే ఈ ఆక్షేపణ ఇప్పుడీ రోజుల్లో మనబోటి పాఠకులం గాదు. భాగవత కథా శ్రవణం చేస్తున్న పరమ భాగవతుడు పరీక్షిత్తే లేవనెత్తాడు. దానికి సమాధానమిస్తూ శుకమహర్షి.

"నృణాం నిశ్రేయసార్థాయ - వ్యక్తిర్భగవతో భువి అవ్యయస్యా ప్రమేయస్య - నిర్గుణస్య గుణాత్మనః నచైవమ్ విస్మయః కార్యోభవతా భగవత్యజే”

  నీ విందులో ఆశ్చర్యపడనక్కరలేదు. అగుణుడయి కూడా భగవానుడు సగుణుడుగా భాసిస్తున్నాడంటే అది మనబోటి జీవుల ననుగ్రహించటానికే. యోగీశ్వరేశ్వరుడాయన. ఏది చేసినా ఆయనకు దాని గుణదోషాలేవీ అంటవు.

  అసలిది నీవుగాదు. కృష్ణుడే వేశా డీప్రశ్న గోపికలను. “ప్రతి యాత వ్రజమ్ నేహ స్థేయం స్త్రీ భిస్సు మధ్యమాః” మీరిక్కడ ఉండరాదు. వెళ్లిపోండి. మాతరః పితరః పుత్రా భ్రాతరః పతయశ్చవః మీకు తల్లీ దండ్రీ భర్తా బిడ్డలూ ఉన్నారు గదా. “భర్తృ శుశ్రూషణం స్త్రీణాం పరోధర్మో హ్యమాయయా” భర్త పరిచర్యే కులస్త్రీలకు సనాతనమైన ధర్మం. “దుశ్మీలో దుర్భగో వృద్ధి” ఏలాటివాడైనా సరే కట్టుకొన్న నాథుణ్ణి కాదనరాదు. “జుగుప్సితం చ సర్వత్రహ్యౌప పత్యం కులస్త్రీయః” కులస్త్రీ అయిన దానికి మిండఱిక మనేది మహాపాతకం. అని మందలిస్తే కర్ణకఠోరమైన ఆ మాటలు విని గోపికలు.

“మైవం విభోర్హతి భవాన్ గదితుమ్ నృ శంసం సంత్యజ్య సర్వ విషయాం స్తవ పాద మూలం భక్తా – భజస్వ దురవగ్రహ - మా త్యజాస్మాన్ దేవో యథాది పురుషో భజతో ముముక్షూన్”

Page 153

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు