#


Index

ప్రతిష్ఠాపన

  తత్త్వ సాహిత్యాలకు నడుమ ఉన్న ఈ సమన్వయ రహస్య సూత్రాన్ని గ్రహించి ఆ సూత్రాన్ని వదలకుండా సాహిత్య సృష్టి చేయగలవాడే మహాకవి. దేశ కాల వ్యవధులను దాటిపోయిన చూపుగలవాడు కాబట్టి వాడే మహర్షి. ఇలాటి మహర్షులైన మహాకవులెందరో లేరు లోకంలో. "ద్విత్రాః పంచ షావా” అన్నాడు అలంకారిక మూర్ధన్యుడైన ఆనంద వర్ధనుడు. ఇద్దరో ముగ్గురో, నలుగురో, అయిదుగురో వేళ్లమీద లెక్క పెట్టవచ్చు. వారిని. ఒక వ్యాసుడు, ఒక వాల్మీకి, ఒక కాళిదాసు వీరంతా ఋషిత్వమూ, కవిత్వమూ రెండూ అలవడిన మహనీయులు. దృష్టిచేత ఋషులైతే, సృష్టిచేత కవులు. వారి దృష్టి ఆయా దేశకాలాలకు గాని, పరిస్థితులకు గాని, ఒకానొక చరిత్రకు సమాజానికి గాని పరిమితమైనది కాదు. సార్వకాలికమూ, సార్వజనికమూ అయిన విశాల గంభీరమైన దృష్టి వ్యాస భగవానుని మహాభారతాన్ని వర్ణిస్తూ భట్టబాణుడిలా అంటాడు. “కిమ్ కవేస్తస్య కాన్యేన సర్వ వృత్తాంతగామినీ కథేవ భారతీ యస్య, నవ్యాప్నోతి జగత్ప్రయమ్" ఆ కవి దేనికి ఆ కావ్యం దేనికి మహాభారత కథలాగా మూడు లోకాలూ వ్యాపించకపోతే.

  అక్షరాలా యథార్ధ మీ మాట. తత్త్వమనేది సర్వవ్యాపకం గదా. దాని వివర్తమే గదా ఈ సర్వ ప్రపంచమూ. కాబట్టి తాత్త్వికుడైన కవి భావన కూడా ఈ సమస్త సృష్టినీ వ్యాపించి తీరాలి తప్పదు. అలా వ్యాపించటం మూలాన్నే పురాణేతి హాసప్రణేతలైన మహర్షులు జగత్ప్రయ వృత్తాంతాన్నీ ఆపోశనం పట్టారు. వారికీ విశ్వమంతా కథా వస్తువే. ఇందులో నివసించే ప్రాణులందరూ పాత్రవర్గమే. ఒక మానవులే గాదు పశు, పక్షి, సరీసృప వృక్షలతా, గుల్మాదులు కూడా వారితోపాటు వ్యవహరించే వ్యక్తులే వారి దృష్టికి. ఆ మాటకు వస్తే చేతన ప్రకృతే గాదు. వన నదీ సముద్ర పర్వత సూర్య చంద్ర గ్రహ నక్షత్ర తారాది జడ ప్రకృతి కూడా పిలిస్తే పలుకుతుంది వారికి. పోతే ఇక అత్యుదాత్త భావాల దగ్గరి నుంచీ అతి నికృష్ణ భావాలదాకా ఎంతెంత భావ వైచిత్రి ఉందో అదంతా వారికి వర్ణనీయమే ఏదీ వర్ణనీయం కాదు.

  అలాగైతే ఈ మానవులకు వారు చేసే ప్రబోధమేమిటి. అంత వైషమ్యంలో మనం చూచే సౌందర్యమేమిటి. అదే చిత్రం. సృష్టిలో ఇది

Page 15

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు