#


Index

ప్రతిష్ఠాపన

  తాలుస్తుందని చెప్పాము. అది విశ్వవ్యాపి అయిన తాత్త్విక స్థాయిలోనే కలిగినప్పుడిక దానికి బాహ్యంగా విశ్వమంటూ ఒకటిలేదు. విశ్వమంతా భావనే. విశ్వతోముఖమైన విశ్వజనీనమైన భావన అది. అది ఏకరూపమైనా సువర్ణం మాదిరి బహురూపాలు ధరించి కటక కుండలాదుల లాగానే బహుముఖంగా దర్శనమిస్తుంది మనకు. సాహిత్యంలో మనం చూచే కథలూ, పాత్రలూ, సన్నివేశాలూ, వర్ణనలూ, రసభావాలూ అన్నీ సువర్ణాభరణ న్యాయంగా ఆ తాత్త్విక దృష్టి ధరిస్తూ పోయే నానావిధాకృతులే. ఉదాత్త గంభీరమైన ఆ భావనే ఆయా పాత్రలుగా భావాలుగా మాటలుగా చేష్టలుగా మూర్తిభవించి అనేక భంగిమలలో కనిపిస్తున్న దనుకోవాలి. అలాటి దృష్టితో చూడాలి మనం. ఒక అద్దాల మహలులో మధ్య నిలుచొని చుట్టూ చూచినట్టు. "నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వాడాడు" అన్నట్టు ఒకే తత్త్వం పెక్కు, రూపాలతో గోచరిస్తే అంతకన్నా అందమేముంది సృష్టిలో, స్వరూపంలో అంతర్గతంగా ఉన్న అందం దాని విభూతిలో బయట పడుతుంది. కనుకనే కవి భావనలో కనిపించని సౌందర్శమెప్పుడూ తత్కావ్య రచనలో బయటపడేది. ఇదే కావ్య సౌందర్యమంటే.

  అలా భాసించే సౌందర్యమంత మాత్రంతో నిలిస్తే మరలా సుఖంలేదు. ఈ కథా పాత్ర సన్నివేశాదులన్నీ మరలా ఏమిటా ఎక్కడివా వీటి గమ్యమేమిటా అని పరామర్శిస్తే చాలు. అవి అంతకంతకూ తమ ప్రత్యేకత్వాన్ని కోలుపోయి అన్నీ కలిసి చివరకా మూలతత్త్వాన్నే మనకు వ్రేలుపెట్టి చూపుతాయి. అందుకోసమే మేమున్నాము. మా సృష్టి అందుకే మా ద్వారా దానినందుకొంటే చాలు అదే మేము మీకు చేయగలిగిన ఉపకారమని మౌనభాషలో వ్యంగ్యంగా మనకొక ప్రబోధమిస్తాయి. అప్పుడివన్నీ సత్యం కావు. సత్యాన్ని అడుగడుగునా మనకు జ్ఞాపకం చేసే సంకేతాలు Symbols మాత్రమేనని బోధపడుతుంది. స్వరూపం సత్యమైతే విభూతి అంతా అప్పటికి దాన్ని చేరే ఒక సాధనం Means మాత్రమే నన్న మాట. ఇందులో స్వరూపం విభూతిగా మారటం సౌందర్యమైతే ఈ విభూతి అంతా మరలా ఆ స్వరూపమే నని గ్రహించటం గొప్ప ప్రబోధం మన పాలిటికి.

Page 14

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు