తాను సకల జగత్కర్త నని అహంకారమున్నది. తానే విష్ణు నాభి కమలం నుంచి సృష్టి అయిన వాడు తనకన్నా సృష్టి కర్త లేడని అహంకరించటమేమిటి. నీ సృష్టి ఎంత నీవెంత నేనిచ్చినదే గదా నీకాశక్తి - నీతో సహా ఈ చరాచర జగత్తునంతా సృష్టించినవాడను నేను-కావలసి వస్తే చూడు నా మహిమ అని తన అఘటన ఘటనా పటీయసి అయిన ఐశ్వర్యశక్తిని తార్కాణ చేయటమిది. దీనితో చతుర్ముఖుడికి సహజంగా ఉన్న రజోమాలిన్యం పోయి సత్త్వగుణ మలవడాలని కూడా ఇది ఒక ప్రబోధమే.
పోతే దేవేంద్రుడి దింకా రాజసమైన ప్రవృత్తి. బ్రహ్మకు సృష్టి కర్తననే అభిమాన ముంటే ఇతడికి సృష్టి అయిన ఈ త్రిలోకాలనూ పాలించే అధికారం నాదే గదా అనే దురభిమానముంది. దానిని కూడా వదలించాలనుకొన్నాడు భగవానుడు. నందాదులు ఏటేటా చేసే ఇంద్రోత్సవం అక్కరలేదని వారించాడు. “తస్మాద్గవాం బ్రాహ్మణానా - మద్రేశ్చా రభ్యతామ్ మఘః”
దాని బదులు గోవులకు, బ్రాహ్మణులకూ గోవర్ధనాద్రికీ ఉత్సవం జరపమని బోధించాడు. "ఏతన్మ మ మతం తాత క్రియ తాం యది రోచతే” ఇది నా అభిప్రాయం మీ కిష్టమైతే చేయండి అని చెబుతాడు. సరేనని వారాయన చెప్పినట్టుగానే చేస్తారు. ఇంద్రుడి కెక్కడ లేని ఆగ్రహం వచ్చి ఆగమేఘాలుగా వర్షం కురిపిస్తాడు. వవృషుర్జల శర్కరాః ఏకధారగా శిలావర్షం కురుస్తాయి మేఘాలు. దానికి భయకంపితులైన ప్రజనివాసి ప్రజలనందరినీ చూచి కృష్ణుడు గోవర్ధనాద్రిని ఒంటి వ్రేలితో పైకెత్తి
బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలం డోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోకు-డీ శైలాం భోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై బడ్డనా కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్
అని ఆహ్వానిస్తాడు. వెంటనే వారంతా దానిక్రింద తల దాచుకొని ఆ జల ప్రళయాన్ని దాటి సుఖిస్తారు. అది చూచి విస్మితుడైన దేవేంద్రుడు “నిస్తంభో భ్రష్ట సంకల్పః స్వయం మేఘాన వారయత్" గర్వభంగం చెంది మేఘమండలాన్ని ఉపసంహరించి వెళ్లుతాడు. దేవగణాలన్నీ ఆకాశం నుంచి స్తోత్ర పాఠాలు చేస్తూ
Page 149