శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండం కనిపించింది. అది కలో వైష్ణవ మాయో తెలియక ఉన్నట్టుండి జ్ఞానోదయమై "ఏ మఱితిమి గాని ఈశుడీతడు మాకున్” అని అర్భకుని ఈశ్వరత్వాన్ని గ్రహిస్తుందాతల్లి. ఇలా సుకుమారంగా యశోదకు బోధిస్తాడు తన మహత్వాన్ని. మరొకమారు తల్లి తన అల్లరి భరించలేక ఉలూఖలానికి కట్టి పడవేస్తే దాన్ని ఈడ్చుకొంటూ రెండు మద్ది చెట్ల మధ్యనుంచి ప్రాకిపోతాడు. అవి రెండూ విరిగిపడి నలకూబర మణిగ్రీవులనే గంధర్వుల రూపంలో కనిపించి ఆయనకు నమస్కరించి వెళ్లిపోతారు. శాపగ్రస్తులైన దేవతల నానెపంగా అనుగ్రహిస్తాడు పరమాత్మ.
పోతే బ్రహ్మేంద్రాది దేవతలనూ నారదాది మహర్షులను కూడా ఎంతో సౌమ్యంగా శిక్షిస్తాడు పరమాత్మ. అఘాసురుడి బారి నుండి గోగోప బాలురను కాపాడగలిగాడని మహత్త్వమెట్టిదో పరీక్షించి చూడాలని బ్రహ్మ ఎవరికీ తెలియకుండా వచ్చి వారందరినీ తీసుకుపోయి రహస్యంగా ఎక్కడో దాచాడు. తరువాత కృష్ణుడు వెతికి చూస్తే ఎక్కడా కనిపించలేదు. అదంతా విధివంచన అని తెలుసుకొని కృష్ణుడు. “ఉభ యాయిత మాత్మానమ్ చక్రే విశ్వ దృగీశ్వరః" విశ్వ రహస్యమంతా ఎఱిగిన ప్రోడ కాబట్టి గోగోపకుల ఉభయరూపాలూ తానే తన మాయాబలంతో ధరించి ఎవరికీ ఏ మాత్రమూ అనుమానం తగలకుండా సంచరిస్తూ వచ్చాడు. ఈ రీతిగా ఒక సంవత్సరం కాలం గడచిపోయింది.
ఏవమ్ విమోహయన్ విష్ణుమ్ విమోహం విశ్వమోహనం స్వయైవ మాయ యా 2 జోపి స్వయమేవ విమోహితః
విశ్వమోహనుడైన పరమాత్మనే మోహితుణ్ణి కావింపబోయి తానే తదీయ మాయచేత మోహితుడయ్యాడు పితామహుడు.
ఉత్థాయోత్థాయ కృష్ణస్య చిరస్య పదయోః పతన్ ఆస్తే మహత్త్వం ప్రాగ్దృష్టం - స్మృత్వా స్మృత్వా పునః పునః
వెంటనే వచ్చి కాళ్లమీద పడి అంతకు ముందు యుగాంత కాలంలో తాను చూచిన భగవద్విభూతినంతా జ్ఞాపకం చేసుకొని పునః ప్రణామం చేసి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోతాడు. ఏమిటీ సన్నివేశం. ఏమి చెబుతుంది మనకు. బ్రహ్మకు
Page 148