విషాని క విషయమైన తత్త్వమని తెలియదు దానికి. వెంటనే మేనుపెంచాడు కృష్ణుడు. పాదాలు పైకెత్తాడు. నర్తనక్రియ కుపక్రమించాడు. అయోఘనాలవంటి ఆ పాదాల అవఘాతానికది నుగ్గు నూచమయింది. ఇలా కాల కళలన్నిటినీ శిక్షించి చివరకు కాలాన్నే శిక్షించదలచాడు భగవానుడు. దాని మొదటి పరివారం చాణూర ముష్టికులు. ఒకటి ఊరుబలం. మరొకటి ముష్టి బలం. కామక్రోధాలే ఇవి. మొదటిది కామానికైతే రెండవది క్రోధానికి సంకేతం. ఈ ద్వంద్వాలను జయిస్తే రెండవ పరివార మొకటున్నది. కువల యాపీడం. కువలయమంటే భూవలయం. భూవలయాన్నంతా ఎలా పడితే అలా పీడించేది. కుత్సితంగా వలయం అంటే చుట్ట చుట్టు కొంటూ పోయేది. అదే అన్ని అనర్ధాలకూ మూలమైన అవిద్యా పిశాచి. పెంజీకటి లాటి నల్లని రూపం దానిది. వచ్చి మీద పడటమే తప్ప మరేమీ తెలియదు దానికి. పట్టి పాలార్చాడు దాన్ని కృష్ణ పరమాత్మ. పోతే ఇక మూడవది ఆఖరిది ఒక్కటి. అదే కాలచక్రం. కంసుడి రూపంలో ఎదట కనిపిస్తున్నది. అంతవరకూ మారు లేక మసలుతున్నది. ఒక్క దెబ్బతో దాన్ని జుట్టు పట్టి తమగం మీదినుంచి క్రింది కీడ్చి అంతమొందించాడు కృష్ణుడు. అంటే కాలానికే కాలుడయ్యాడన్న మాట. కాలోస్మి లోక క్షయకృత్ప్రవృద్ధః అని గదా భగవద్వాక్యం.
ఇలా దుష్టులనే గాదు భగవానుడు శిష్టులను కూడా ఒక విధంగా శిక్షిస్తూ వచ్చాడు. శిక్షించటమంటే ఇక్కడ దండించటం కాదు. బోధించటం కావచ్చు. అనుగ్రహించటం కావచ్చు. కృష్ణుడు మన్ను దిన్నాడని పిల్లలంతా వచ్చి చాడీలు చెప్పారు తల్లి యశోదకు. అన్నా మన్నేల మరి పదార్ధము లేదే అని తల్లి మందలించింది. అమ్మా మన్ను దినంగ నేశిశువునో ఆకొంటినో వెణ్ణినో అంటాడు కుమారుడు. నిజమే. ఆయన శిశువు కాదు. ఆకలి దప్పులున్న వాడూ కాదు. జీవులలాగా వెఱివాడూ కాదు. సర్వజ్ఞుడైన భగవానుడు వెఱివాడెలా అవుతాడు. ఆకలి దప్పులేమి టాయనకు. అయితే ఎందుకు తిన్నాడు మన్ను. యశోద కోసమే. తింటే గాని పిల్లలు వెళ్ళి చెప్పరు. చెబితే గాని ఆవిడ పిలిచి చీవాట్లు పెట్టదు. పెడితే చెబుదామనుకొన్నాడు. ఏమిటి. “కాదేనిన్ మదీయాస్య గంధ మ్మాఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన” దండించమని. అంటూనే నోరు తెరిచాడు. ఏముంది ఆ నోటిలో. మన్నూకాదు మశాన్యమూ కాదు. జలధి పర్వతవన భూగోళ శిఖితరణి
Page 147