#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

ఉపాయం కూడా సెలవిచ్చాడు. పుత్ర మిత్ర కళత్రాదుల నందరినీ తత్త్వద్విశేష రూపాలుగా గాక బ్రహ్మరూపంగా దర్శించటమే ముక్తికి త్రోవ నిరూపించటానికే తాను జన్మించటమని కూడా చెప్పినట్టయింది. అది

  తరువాత జరగవలసిన పనులు కూడా వసుదేవుడికి అప్పగించి వారు చూస్తుండ గానే పసిబిడ్డలాగా మారిపోతాడు. ఆయన ఆదేశించినట్టే కారాగృహ ద్వారాలు తెరుచుకొంటాయి. సుదుస్తర అయిన యమున కూడా దారి ఇస్తుంది. యోగమాయా వశీకృతులై దౌవారికులూ, పౌరులూ అంతా గాఢనిద్రలో మునిగి ఉంటారు.

ద్వారస్తు సర్వాః పిహితా దురత్యయా బృహత్కవాటా 2 యసశృంఖలైః కిల

  వసుదేవుడు బయటికి రాగానే ద్వారాలన్నీ యథాపూర్వంగా మూసుకొంటాయి. "శేషో న్వగాద్ద్వారి నివారయన్ ఫణైః" శిశువుకు శీతవాతాది దోషాలు తగలకుండా ఆదిశేషుడు ఫణా మండలం విప్పి గొడుగు పడతాడట. ఇదంతా భగవదను భావ విశేషం గాక మరేమిటి. మరే అవతారంలో ఇలాంటి సంరంభం చూడగలం. వసుదేవుడెప్పుడా యశోద వద్ద బాలుణ్ణి దించిందీ - ఆవిడ నుంచి మాయా కన్య నెప్పుడు కొని తెచ్చిందీ ఇక్కడా అక్కడా ఎవరికీ అంతు పట్టలేదు. రాత్రికి రాత్రి అంతా జరిగిపోయింది. తెల్లవారుజామున బిడ్డ ఏడుపు విని ఉలికిపడి లేస్తారు కావలివారు. అంతకు ముందేడవని బిడ్డ బొట్టు పెట్టినట్టప్పుడే ఏడవటం దేనికి. కంసుడికి వార్త తెలియటమెలా మరి. అందుకే ఆ ఏడుపు. అంత పనీ జరిగింది. కావలి వారు పోయి చెప్పటమూ కంసుడు రావటమూ క్షణాలమీద జరిగింది. అల్లుడు గాడిది మేనగోడలు-నీకు భయం లేదని చెల్లెలెంత మొత్తుకొంటున్నా లెక్క చేయక ఆవిడ చేతిలో నుంచి లాక్కొని పైకెగరేశాడు బిడ్డను. క్రింద కత్తి పట్టాడు దానికి సూటిగా నేలమీద. అది బిడ్డ అయితే గదా క్రింద పడటానికి. భగవన్మాయ ఆమె. “అదృశ్య తాను జావిష్ణో స్సాయుధాష్ట మహా భుజా దివ్యస్ర గంబరా ధనుశ్మూ లేషు చర్మాసి శంఖ చక్ర గదా ధరా” అష్ట భుజాలతో ధనుశ్చక్రాది దివ్యాయుధాలతో సాక్షాత్కరిస్తుంది - అంతరిక్షంలో. సరిగా ఇది ముక్తావిద్రు మహేమ నీల ధవళ చ్ఛాయైర్ముఖైః అని వర్ణించిన గాయత్రీ మంత్రాధిదేవతే మరేదీ గాదు

Page 145

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు