తమ ద్భుతమ్ బాలక మంబు జేక్షణం చతుర్భుజం శంఖ గదా ద్యుదాయుధమ్ శ్రీవత్స లక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం
మహార్హవైడూర్య కిరీట కుండల - త్విషా పరిష్వక్త సహస్ర కుంతలమ్ ఉద్దామ కాంచ్యంగద కంకణాదిభి - ర్విరోచ మానమ్ వసుదేవ ఐక్షత
ఇలాటివాణ్ణి దర్శించాడట వసుదేవుడు. అలోక సాధారణమైన ఈ అద్భుత వేషాన్ని వర్ణించటంలోనే తెలుస్తూంది మనకది సాక్షాత్తూ నారాయణ మూర్తేనని. కనుకనే అది చూడగానే వసుదేవుడు “విది తోసిభవాన్ సాక్షాత్పురుషః పరః” అని ఆ మూర్తిని పరమపురుషుడుగానే గుర్తించి కీర్తిస్తాడు. తల్లి దేవకి కూడా స్తుతిస్తుంది. అసలంతకు ముందు గర్భంలో ఉండగానే వచ్చి బ్రహ్మేంద్రాది దేవతలంతా గర్భస్థుడైన స్వామినే ఎన్నో విధాలుగా స్తోత్రం చేసిపోతారు. ఇదంతా కృష్ణుడు సాక్షాత్తూ నారాయణుడేనని చెప్పకుండానే చెబుతున్నది లోకానికి.
దేవకీ వసుదేవుల స్తోత్ర పాఠమంతా విని స్వామి దేవకిని చూచి నీవు పూర్వ జన్మలో పృశ్నివి. ఇతడు సుతవుడనే ప్రజాపతి. ప్రజాసర్గం చేయమని మిమ్ములను బ్రహ్మ ఆదేశిస్తే మీరు ద్వాదశ దివ్యవర్ష సహస్రాలు నన్ను గూర్చి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షమై వరం కోరమంటే నాలాంటి కొడుకు కావాలని కోరుకొన్నారు. జగన్మోహిని అయిన నామాయ పని చేసి మీరు అపవర్గం కోరలేక పోయారు. దాని ఫలితంగా నేను మీకు మొదటి జన్మలో వృశ్నిగర్భుడనే పేర జన్మించాను. రెండవ జన్మలో అదితి కశ్యపులైన మీకు వామనుడుగా అవతరించాను. ఇప్పుడు దేవకీ వసుదేవులైన మీకు నేను మూడవ జన్మలో ఈ రూపంతో ఆవిర్భవించాను. మీకీ జన్మాంతర స్మృతి కలగటానికే నేనీ అప్రాకృతమైన రూపం మీకు చూపవలసి వచ్చింది. మీరిక మీదట నన్ను పుత్రభావంతోనూ బ్రహ్మభావంతోనూ చూస్తూ తరించండి అని బోధిస్తాడు. చూడండి. భగవదుపదేశం ఇక్కడి నుంచే ఆరంభమయింది. “వేదాహం సమ తీతాని” అన్న భగవదుక్తి కిది నిదర్శనం. అతీతా నాగతవర్తమానాలు తెలిసినవాడే సర్వజ్ఞుడు. వాడే భగవంతుడు. పైగా సంసారంలో ఉంటూనే గృహస్థులు తరించే
Page 144