#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

స్మరించటానికిష్టపడని వైష్ణవోత్తములు కూడా వైష్ణవ దుర్గ అనే ఒక కొత్త పేరు పెట్టి ఆ పరాశక్తిని తమ వైష్ణవాలయాల్లో ప్రతిష్ఠించి ఆరాధిస్తూ వచ్చారంటే ఇంతకన్నా ఉభయ మత సామరస్యానికి నిదర్శనమేముంది.

  అసలా మాటకు వస్తే ఈ శక్తి ఎవరోగాదు. సాక్షాత్తూ గాయత్రీ మంత్రాధి దేవత. మంత్రార్ధమంతా ఆవిడ వ్యవహారంలోనే మనకు స్పష్టంగా బోధ పడుతుంది. సవిత యొక్క వరేణ్యమైన తేజస్సది. సవిత అంటే ప్రపంచ సృష్టికీ తన అవతార సృష్టికీ కర్త అయిన పరమేశ్వరుడే. జ్ఞానాత్మిక కాబట్టి ఆయన శక్తి తేజోరూపిణి, జీవులశక్తిలాగా తమోరూపిణి గాదు. మనబోటి జీవులంతా అజ్ఞాన తిమిరాంధులు కాబట్టి వీరి శక్తికూడా తమోరూపిణే. తమోరూపిణి గనుకనే ఇది మనకు వరణీయ కాదు. వరణీయ ఎప్పటికైనా తేజోరూపిణి అయిన పరమాత్మ శక్తే. అదే భర్గమంటే. దానినెప్పుడో ఏ జన్మలోనో కోలుపోయాము మనం. మరలా దాన్ని పొందే ప్రయత్నం సాగించాలి. అందుకోసం నిరంతరం దాన్ని భక్తి తాత్పర్యాలతో ధ్యానించటం తప్ప మరొక మార్గం లేదు. అలా ధ్యానిస్తే అది మరలా మన బుద్ధులన్నీ తమస్సు నుంచి తప్పించి ఆ తేజస్సువైపుకే తీసుకెళ్లుతుంది. సందేహంలేదు. ఈ గాయత్రీ రహస్యమంతా ప్రస్తుత మీ యోగమాయ ఆవిర్భవించటంలోనూ అంతర్ధానం చెందటంలోనూ గుప్తమయి ఉంది. పరమాత్మ అవతరించటానికి ముందే అవతరించిందాయన తేజోరూపిణి అయిన ఈ మాయ. ఆయన రాకను ముందుగా సూచించింది లోకానికి. దేవకీ గర్భాన్ని సంకర్షణ చేసి రోహిణీ గర్భంలో ప్రవేశ పెట్టటం జీవుణ్ణి ప్రాపించికమైన స్థాయి నుంచి పారమార్థికమైన భూమికకు ప్రచోదన చేయటమే. అది నిత్యమూ మన దగ్గరే ఉన్నా దాని ప్రభవాన్ని మన అజ్ఞానవశాత్తు గుర్తించలేము. దీనికి చిహ్నమే యశోదా నందాదులకు దాని అస్తిత్వాన్ని గుర్తించే స్మృతి లేకపోవటం. పోతే చూచి కూడా తెలుసుకోలేని మూఢులు కొందరుంటారు కంసుడి లాంటివాళ్లు. వాళ్లకది ఎప్పుడూ చిక్కదు. అతీతంగా విహరిస్తుంటుంది. ప్రచోదయంతీ పవనేద్విజాతా అన్నట్టు అంతరిక్షంలోనే సంచరిస్తుంటుందా గాయత్రి. అష్ట భుజాలతో కనపడటం గాయత్రీ లక్షణమే. తుద కావిడ మహత్త్వాన్ని తెలుసుకొని నిత్యమూ భక్తి శ్రద్ధలతో జపించే వారికి సర్వకామ ప్రదాత్రి అని వర్ణించటంలో కూడా "ఆయుః

Page 142

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు