మనకు సమాధానమిస్తున్నది. యుక్త వయసు వచ్చిన తరువాత దేవకీ వసుదేవుల నొకసారి చూడటానికి వెళ్లి వారు తన మాహాత్మ్యాన్ని ప్రశంసించబోతే వారెక్కడ తాను దేవుడని భావిస్తారో అని “మాభూదితి నిజామ్ మాయామ్ తతాన జన మోహినీమ్” సకల జన సమ్మోహిని అయిన తన మాయ వారిమీద ప్రయోగించాడట. దానితో వారు మామూలు కుర్రవాడేనని భావించి మురిసిపోయారట. ఇదుగో ఇలాటి సమ్మోహినీ మంత్రాన్నే వ్రేపల్లెలోని ప్రజలమీద కూడా ప్రయోగించి ఉంటాడు. పరమాత్మ. అసలు యోగమాయ జరిపిన కార్యమన్నప్పుడే అది మాయామయం. అది ఈ లోకుల లౌకిక ప్రజ్ఞకంతు చిక్కే వ్యవహారం కాదు. కనుకనే రోహిణీ గర్భవృత్తాంతాన్ని మామూలు విషయంగానే భావించారు గాని ఎవరు గాని ఇది ఎలాగబ్బా అని లేశమాత్రం కూడా ఆవిడ శీలాన్ని శంకించిన వారు కారు.
ఇది ఒకటి రహస్యం. ఇది అయిన తరువాత మరొక రహస్యమేమంటే కాళి, భద్ర, కామేశ్వరి, దుర్గ, అంబిక అని యోగమాయ కెప్పుడు పేర్లు పెట్టారో అప్పుడావిడ విష్ణుమాయే గాక శివమాయ కూడా అనుకోవలసి వస్తుంది. దుర్గ, అంబిక, కాళి అన్నప్పుడు అవి పార్వతీ పర్యాయాలే గదా. పార్వతి శివశక్తి. ఆవిడ విష్ణుశక్తిది ఎలా అయింది. దీనిని బట్టే చెప్పవచ్చు మనం శివ కేశవులకు భేదం లేదని.
శివాయ విష్ణు రూపాయ - శివ రూపాయ విష్ణవే యథా శివ మయో విష్ణు - రేవం విష్ణు మయ శ్శివః
అంతేకాదు. “యథాంతరం నవశ్యామి - తథామే స్వస్తి రాయుషి” వారిరువురికీ అంతరం చూడరాదంటున్నది వేదవాక్యం. ఇలా శివ కేశవులిరువురూ ఒక్కటే తత్త్వం గనుకనే వారి శక్తులు కూడా భిన్నం కావు. అవీ ఒక్కటే. అందుకే యోగమాయకు వైష్ణవ నామాలు శైవనామాలూ రెండూ చెల్లుబడి అయినాయి. దుర్గ కాళి అంబిక ఇత్యాదులు శైవనామాలైతే, వైష్ణవి నారాయణి, కృష్ణా, మాధవీ ఇలాటివన్నీ వైష్ణవ సంజ్ఞలు. ఒకే శక్తి కలిగిన ఒకే ఒక తత్త్వం గనుకనే బాలకృష్ణునిలోనే శివమూర్తి దర్శించగలిగాడు మహాకవి పోతన. ఆ మాయాశక్తే ప్రస్తుతం కృష్ణ సహోదరిగా జన్మించటం మూలాన్నే పరమ భాగవతులావిడను “సరసి జనాభ సోదరీ” అని కూడా సంబోధించి గానం చేశారు. తుదకు శివ పార్వతుల నామం కలలో కూడా
Page 141