అంతా భగవల్లీల. భగవానుడొకనాడు వైకుంఠంలో కూచొని తన యోగమాయ నిలా ఆజ్ఞాపిస్తాడు.
దేవక్యా జఠరే గర్భమ్ శేషాఖ్యం ధామ మామకం తత్సన్ని కృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ
నా అంశ ఒకటి శేషాఖ్యమైనది దేవకి సప్తమ గర్భంగా ఏర్పడుతుంది. దానిని నీవు సంకర్షణ చేసి నందగోప్రజంలో దలదాచుకొంటున్న రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. “అథాహ మంశ భాగేన దేవక్యాః పుత్తతామ్ శుభే ప్రాప్స్యామి” నేను మిగతా అంశతో దేవకికి అష్టమ గర్భంగా అవతరిస్తాను త్వం యశో దాయాం నంద పత్న్యాం భవిష్యసి నీవు మాత్రం యశోదకు బిడ్డగా జన్మిస్తావు. నిన్ను లోకులు
దుర్గేతి భద్ర కాళీతి - విజయా వైష్ణ వీతిచ కుముదా చండికా కృష్ణా - మాధవీ కన్యకేతిచ మాయా నారాయణీ శానా శారదేత్యం బికేతిచ భజి ష్యంతి
ఈ ఈ సంజ్ఞలతో నిత్యమూ పూజిస్తూ పోతారు.
ఇక్కడ రెండు రహస్యాలు మనం గ్రహించవలసి ఉంది. దేవకి అష్టమ గర్భమే కంసవధకు కారణం. అంతవరకూ కంసుడికి భయంలేదు దానికోసం ప్రతీక్షిస్తున్నాడు. వాడు. ఆరు గర్భాలనప్పటికే హతమార్చాడు. ఇక ఏడవ దానికోసం చూస్తుండగా అది యోగమాయ మూలంగా దేవకి నుంచి రోహిణికి రవాణా అయిపోయింది. ఇది తెలియక లోకులంతా ఆవిడ గర్భం దిగజారిపోయందనుకొంటే కంసుడు కూడా అలాగే అనుకున్నాడు. ఇక వచ్చేది భగవదవతారమే కదా అని వెయ్యి కళ్లతో చూస్తుంటే తరువాత అది కూడా తారుమారవుతుంది. ఆ విజ్జోడు పడిన బిడ్డనే చూచి వాడష్టమ గర్భమదేనని భ్రమించి విఫల ప్రయత్నుడవుతాడు. ఇదే వైష్ణవ మాయ. ఇంతకన్నా పెద్ద మాయేమంటే రోహిణికి గర్భమెలా వచ్చిందో ఎవరికీ అంతు పట్టకపోవటం. వసుదేవుడికి దూరంగా ఎక్కడో నంద గోకులంలో ఉన్న రోహిణి గర్భం తాల్చట మేమిటి. లోకులను మానించకపోవటమేమిటి. దానికి కూడా ఈ యోగమాయా ప్రభావమే సమాధానం. ఎక్కడికక్కడ భగవన్మాయ పని చేస్తూనే ఉందని భాగవతమే
Page 140