#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

వసుదేవ గృహేసాక్షాద్భగవాన్ పురుషః పరః జనిష్యతే - తత్పూజార్థమ్ సంభవంతు సురస్త్రీయః వాసుదేవ కళానంత స్సహస్ర వదనః స్వరాట్ అగ్రజో భవితా దేవో హరేః ప్రియ చికీర్షయా విష్ణోర్మాయా భగవతీ యయా సమ్మోహితం జగత్ ఆ దిష్టా ప్రభుణా తేన కార్యార్థమ్ సంభ విష్యతి

  సాక్షాత్తూ భగవానుడే వసుదేవ గృహంలో జన్మిస్తాడు. ఆయన కళాంశమైన అనంతుడు బలరాముడుగా అవతరిస్తాడు. యోగమాయ ఆయన కార్యం నెరవేర్చటానికి యశోద కుదయిస్తుంది. దేవతా స్త్రీలంతా స్వామివారి సేవకోసం భూమి మీద గోపికలుగా జన్మించబోతారు.

  తరువాత కొంత కాలానికి కంసుడికి ఆకాశవాణి హెచ్చరిక చేయటం వాడు భయపడి దేవకిని వధించబోవటం- వసుదేవుడి ఒప్పందంతో విరమించుకోవటం జరుగుతుంది. అష్టమగర్భం గదా తన వినాశానికి కారణమని బరవసాతో వసుదేవుడు తెచ్చి ఇచ్చిన బిడ్డను గూడా వద్దని పంపుతాడు. కాని నారదుడు సందు చేసుకొని వచ్చి ఒకనాడతనితో వెఱివాడా వ్రేపల్లెలో ఉండే నందాది గోపకులూ, మధురలో ఉండే వృష్టి వీరులూ అందరూ భగవత్కార్యార్ధ మవతరించిన దేవతలే సుమా నిన్ననుసరించి ఉన్న జ్ఞాతులంతా అసురాంశలు - నీ వధ కోసమే విష్ణువు స్వయంగా దేవకికి జన్మించబోతున్నాడు. ఆ దేవకీ వసుదేవులను నీవుపేక్షించకుండా బందిఖానాలో పడవేయమని చెప్పి వెళ్లిపోతాడు. వాడికి వెంటనే ఒకటి జ్ఞప్తికి వస్తుంది. "ఆత్మాన మిహ సంజాతం జానన్ ప్రాగ్విష్ణునా హతం మహాసురం కాలనేమిమ్” ఇంతకు ముందు విష్ణువుచేత నిహతుడైన కాలనేమి అనే రాక్షసుణ్ణి నేనని గ్రహిస్తాడు వాడు. కాలనేమి అంటే కాలచక్రమే. అదే కంసాకారం. కంస శీలం. ధర్మాధర్మాలు పరివర్తన చెందుతుంటాయి దీనితో. తన్నిమిత్తంగా భగవంతు డవతరిస్తుంటాడు. కాబట్టి కాలనేమి - కంసుడనే పేర్లు కూడా సాభిప్రాయమే.

  చూడబోతే ఇదంతా ముందుగానే పరమాత్మ వేసిన పథకంగా కనిపిస్తుంది. లేకుంటే నారదుడు రావటమేమిటి ఈ దేవ రహస్యాలన్నీ వాడికి చెప్పటమేమిటి

Page 139

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు