#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

జరగలేదు. రాముడు దేవేంద్రుని సందర్శనానికే నోచుకోలేకపోయాడు. మిగతా వారి సంగతి అసలు చెప్పనక్కరలేదు. ఒక్క కృష్ణావతారంలోనే ఇలాంటి మహిమలన్నీ. అందుకే తక్కిన అవతారాలన్నీ భగవదంశలైతే ఇది భగవానుడే స్వయంగా. భగవచ్ఛబ్దం కృష్ణుడికి మాత్రమే వర్తిస్తుంది. భగవద్గీత అన్నారు. భాగవతమన్నారు. రెండు చోట్ల కృష్ణుడే ఆ భగవానుడు. ఆయన చెప్పిన మాట ఒకటైతే చేసిన చేష్ట మరొకటి. ఒకటి సిద్ధాంతం మరొకటి దాన్ని బలపరిచే దృష్టాంతం. లోకానికీ రెండువిధాలా ఇచ్చాడాయన పరమ పురుషార్థ సందేశం. భగవానుడు కనుకనే అలా చేయగలిగాడు. జ్ఞానైశ్వర్య బల వీర్యశక్తి తేజస్సులనే షడ్గుణాలకూ భగమని పేరు. భగోస్యాస్తీతి భగవాన్. అవి కలవాడే భగవానుడు. ఈషాడ్గుణ్య మాయన జననం దగ్గరినుంచీ నిర్యాణం దాకానే కాక నిర్యాణానంతరం కూడా మనకవగత మవుతుంది.

  కృష్ణ నిర్యాణంతో భాగవత మారంభమవుతుంది. ఇది ఒక చమత్కారం. ఏదో యాదృచ్ఛికంగా దొరలింది కాదిది. సాభిప్రాయంగానే వర్ణించాడు మహర్షి. కృష్ణుడు బ్రతికి ఉన్నంతవరకూ లోకంలో ధర్మ ప్రతిష్ఠ అనేది ఎవరికీ అర్థం కాలేదు. పాండవులు తమవల్లనే అంతా జరుగుతున్నదని భావించారు. యాదవులంతకంటే. రాజర్షులు, బ్రహ్మర్షులూ అంతా కూడా తమ ప్రభావమే ననుకొని ఉండవచ్చు. ఇది మీరెవరివల్లా కాదు మీరంతా నిమిత్త మాత్రం నేనుంటేనే మీరు సుమా అని అందరినీ మౌనంగా హెచ్చరించటానికే ఆయన మరణం. కృష్ణుడి ఈ మరణ వృత్తాంతం హరివంశంలో కానరాదు. అది ఆయన విజయ పరంపరను వర్ణించటంతోనే ముగుస్తుంది. సత్యమేవ జయతే అని నిత్య సత్యమైన భగవత్తత్త్వాన్ని నిరూపించటమే దాని ఉద్దేశం. ఇక్కడ అలా కాదు. ఆయన మరణం కూడా ఒక ప్రబోధమేనని చెప్పటం ముని హృదయం. మరణానికి ముందే పోయారు యాదవులంతా. ఇంకా మృతశేషులు కొందరుంటే వారిని తానే హతమార్చాడు. మరణవార్త విన్నారో లేదో పాండవులిక నిలవలేక మహాప్రస్థానానికి బయలుదేరారు. రాజ వంశానికంతా పరీక్షితొకడు మిగిలాడు. దేశమేలే బాధ్యత అంతా ఆయన మీద పడింది అయితే అప్పటికీ కలియుగ మారంభమవుతుంది. ఒకనాడు వేటకు వెళ్లితే గో వృషభాల సంభాషణ వినిపించింది. అవి గో వృషభ రూపంలో దాగి ఉన్న ధరణీ ధర్మదేవతలే. కృష్ణ భగవానుడు అస్తమించేసరికి లోకంలో సమస్త

Page 137

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు