పరమాత్మకు. ఒక్క కృష్ణావతారమే పరిపూర్ణమైనది. ఇది విష్ణువుకు అంశ కాదు. సాక్షాద్విష్ణువే. ఆ హరి కృష్ణుండు బలాను జన్ము-డెడలే - దావిష్ణుడౌ నేర్పడన్. శుద్ధ సత్త్వోపాధి అయన విష్ణుదేవుడే కృష్ణుడనే మరొక రూపంలో భాసిస్తున్నాడంత మాత్రమే. దీనికి ప్రబలమైన తార్కాణం మనకు భాగవతంలోనే ఒక చోట కనిపిస్తుంది. కృష్ణుడు కుశస్థలిలో ఉండగా ఒకనాడు ద్వారకలో హఠాత్తుగా ఒకబ్రాహ్మణుడు మృతుడైన తన శిశువును రాజద్వారం దగ్గర పెట్టి గట్టిగా విలపిస్తాడు. అప్పటికది ఆయన భార్యకు తొమ్మిదవ కానుపు. పుట్టగానే ఎప్పటికప్పుడు కాలుడా బిడ్డలను పొట్టన పెట్టుకొంటున్నాడట. రాజులు ధార్మికులయి సక్రమంగా దేశాన్ని పాలిస్తుంటే ఇలాంటి అత్యాహితమెలా జరుగుతుంది దీనికంతటికీ దేశపాలకుడే కారణమని నిష్ఠురాలాడతాడా బ్రాహ్మణుడు. అప్పుడక్కడ సన్నిహితుడయి ఉన్న అర్జునుడా మాటలు విని నేను వచ్చి ఆ శిశుహంతలను పట్టి శిక్షిస్తానని అభయమిస్తాడు. బలరామ కృష్ణాది యాదవ వీరులవల్లనే కాని నీవల్ల కాదంటా డావిప్రుడు. వారిని మించిన బలపరాక్రమ శాలినని భీకరాలు పలుకుతా డర్జునుడు. ఇష్టం లేకపోయినా సరేనని చెప్పి వెంట బెట్టుకొని వెళ్లుతాడు బ్రాహ్మణుడు. శతవిధాల పోరి కూడా అర్జునుడు తన ప్రయత్నంలో విఫలుడవుతాడు. ఆ బ్రాహ్మణుడతణ్ణి పడదిట్టి మరలా శ్రీకృష్ణుడి దగ్గరికి పరుగెత్తుకొనిపోయి మొరపెడితే ఆయన శైబ్యసుగ్రీవ మేఘ పుష్ప వలాహకాలనే గుఱ్ఱాలను పూన్చిన రథమెక్కి అర్జునుడితో సహా బయలుదేరి సప్త సముద్రాలూ సప్తకుల పర్వతాలూ దాటి అన్ని దిక్కులూ గడిచిపోయి చివరకు క్షీరసాగరంలో ప్రవేశించి మహాంధ తమసాన్ని ఛేదించుకొంటూ పోగా పోగా శేషశాయి అయిన ఆదినారాయణుడు దర్శనమిస్తాడు. "న నంద ఆత్మాన మనంత మచ్యుతో - విష్ణుశ్చ తద్దర్శన జాత సాధ్వనః" తన ఆత్మస్వరూపుడే అయిన ఆ నారాయణ మూర్తికి నమస్కరిస్తాడు కృష్ణుడు. ఆయన మందస్మితం చేస్తూ నరనారాయణులైన మిమ్ము ఒకసారి చూడాలని ఇక్కడి మహామునులు కోరితే విప్రబాలకుల నపహరించవలసి వచ్చింది. అంతేగాని మరేమీ కాదని చెబుతూ వారికా బిడ్డలనందరినీ ఇచ్చి వీడ్కొలుపుతాడు.
ఈ కథ ఒక్కటే చాలు మనకు శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణుడేనని చెప్పటానికి. మూలవిరాట్టు దగ్గరికి మరలా పోయి రావటమనేది మరి ఏ అవతార చరిత్రలోనూ
Page 136