#


Index

అవతారములు - కృష్ణతత్త్వము

ఈ సృష్టి అంతా ఒకే ఒక తత్త్వమయినప్పుడిక దేవతలేమిటి - దానవులేమిటి. ఒకరినొకరు బాధించటమేమిటి- అసలు భగవంతుడవతరించట మేమిటి. అంతా అబద్ధమే. అప్పుడిక ప్రశ్న లేదు. సమాధానం లేదు. అనవసరం. అలా కాక దేవతలు, దానవులు, సృష్టి అవతారమనే దృష్టి పెట్టుకొని ప్రశ్నించావా. అప్పుడంతా స్వరూపమనే జ్ఞానం నీకు లేదన్నమాట. అలాంటప్పుడు కూడా ప్రశ్న లేదు. ఎందుకంటే వస్తుతత్త్వ మొకవిధంగా ఉంటే నీవు మరొక విధంగా దాన్ని భావించి ఇది ఏమిటి - ఎందుకని అడుగుతున్నావు. ఇది ఎలాటి దంటే స్వప్నంలో ఈ దొంగలెవరు - నన్నెందుకిలా తరుముకొని వచ్చారు ఎందుకలా బాధించారనే ప్రశ్న లాంటిది. దానికి జవాబేమిటో దీనికే అదే జవాబు. అంటే అడిగినా చెప్పినా సుఖం లేదని భావం. అంచేత సారాంశమేమంటే ఒక దీర్ఘ స్వప్నంలాగా ఈ సమస్త సృష్టి ఒకటి ఉందని తాత్కాలికంగా ఒప్పుకొని చేసిన వర్ణనలే ఈ అవతారాది వర్ణనలన్నీ. ఈ దృష్టితో అవతారాలూ, తన్మూలంగా పరమాత్మ చేసే ధర్మసంస్థాపనా సమర్థనీయమే అవుతుంది. ఇలాగే చేశాడాయన జగద్ధర్మ సంస్థాపన.

  పోతే ఇక జీవ ధర్మాన్ని కూడా స్థాపించాడని చెప్పాము. అలా స్థాపించాలంటే కేవలం శిష్ట రక్షణ మాత్రమే చేస్తే సరిపోదు. ఆ శిష్టులైన వారికి వారి వారి తాహతు ననుసరించి కర్మోపాసనా రూపమైన ప్రవృత్తి ధర్మాన్ని కొందరికీ జ్ఞాన వైరాగ్య రూపమైన నివృత్తి ధర్మాన్ని కొందరికి ఉపదేశించి వారి ఆముష్మిక జీవితానికి పనికి వచ్చే అభ్యుదయ నిశ్రేయస ఫలాలను కూడా అందివ్వాలి. అదే అసలు పరమాత్మ చేయగల అసలైన ధర్మ స్థాపన. దీనితో జీవధర్మం కూడా సమగ్రంగా స్థాపించిన వాడవుతాడా పరమేశ్వరుడు. ఇదీ అవతార ప్రయోజనం.

  ఇలాంటి అవతారాల నెన్నింటినో పరిగణిస్తుంది భాగవతం. ముందు చెప్పినట్టు "ఉర్వీశులున్ సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్" అందరూ భగవదంశలే. “యద్య ద్విభూతి మ త్సత్త్వమ్ శ్రీమ దూర్జిత మేవవా” అని భగవానుడే వాక్రుచ్చాడు. అంతా భగవద్విభూతే. భగవదంశే. దాని అంశాంశలే. అందులో ఆయన విభూతి బాగా అభివ్యక్తమైనవి నాలుగు విధాలు. అవి కొన్ని లీలావతారాలు. కొన్ని వ్యూహావతారాలు. కొన్ని అర్చావతారాలు మరికొన్ని విభవావతారాలు. అర్చావతారాలు శిలా తరుతీర్థాదులు. అది బాహ్యమైన జడ ప్రకృతిలో అభివ్యక్తమైన

Page 130

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు