#


Index

విష్ణు పారమ్యము

  అని భాగవతం చాటి చెప్పింది ఇందుకోసమే. పార్థివమైన దారువుకన్నా, ధూమం కన్నా దాని నుంచి వచ్చే అగ్నిజ్వాల ఎలా ప్రకాశాత్మకమో. అలాగే రజస్తమస్సుల కన్నాసత్త్వమే ప్రకాశాత్మకం అంటుంది భాగవతం. అలాంటి శుద్ధ సత్త్వోపాధికమైన ఈశ్వర చైతన్యమే విష్ణువు. అది ఇక విష్ణువా, శివుడా అని వాదించరాదు. “యే చైవ సాత్త్వికా భావా రాజసా సామసాశ్చయే మత్త ఏవేతి తాన్విద్ధి నత్వహం తేషు తేమయి" ఇది మనం విష్ణువని భావించే కృష్ణుని వాక్యం. ఏమంటున్నాడాయన. ప్రపంచంలో సత్వరజస్తమో గుణాత్మకమైన ఏయే భావాలున్నవో అవంతా ఎక్కడివో కావు. నాలోనివే. నాలో నుంచే అవి బహిర్గతమై ఆయా రూపాలుగా భాసిస్తున్నాయి. అయితే చిత్రమేమంటే అవి నాలో ఉన్నవే గాని నేను మాత్రం వాటిలో లేనంటాడు. అంటే అర్థం. త్రిగుణాత్మకమైన సృష్టి చేసినట్టు కనిపించినా తాను త్రిగుణాతీతుడే. ఇలాటి త్రిగుణాతీతమైన ఈశ్వరుడే భాగవత కథానాయకుడు. మనమనుకొనే శివుడూ కాదు, విష్ణువూ కాదు. ఆ ఈశ్వరుడే శుద్ధ సత్వోపాధికుడై సృష్ట్యాదికాన్ని కావించటం మూలాన ఆ గుణాధిక్యాన్ని పురస్కరించుకొని దాన్నే మనం విష్ణువనే సంజ్ఞతో వ్యవహరించవచ్చు. ఇలాటి వ్యవహారమే ఇపుడు భాగవతం కూడా అనుసరిస్తూ వచ్చింది. ఈ దృష్టితో మాటాడితే భాగవతం విష్ణు పరమైనదే. సందేహం లేదు





Page 127

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు