#


Index

విష్ణు పారమ్యము

తక్కువ, విష్ణువే ఎక్కువని లేనిపోని విభేదాలు సృష్టించి జీవిత పరమార్థానికి మనలను దూరం చేయటానికి కాదు. ఒకవేళ అర్ధం చేసుకోటంలో పొరబడి అలా అవుతారేమో ననే అక్కడక్కడా ఈ మూర్తిత్రయాని కతీతమైన తురీయ చైతన్యతత్త్వాన్ని ప్రస్తావించి మరలా మనకు జ్ఞాపకం చేస్తూ పోతుంది భాగవతం. ఆద్యంతాలలో దీన్ని అమూర్తమైన పరబ్రహ్మంగానే నిర్దేశిస్తుంది. ఇంత అయినా ఇంకా పూర్వాపర పరామర్శ చేసుకోలేక కొందరు దురాగ్రహంతో ఇది ఎక్కువ అది తక్కువ అని ప్రలాపాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా శివకేశవ భేదం బాగా వేర్లు పాతుకుపోయింది దేశంలో.

  అది ఉన్నంతవరకూ మానవుడికి పురోగతి లేదు. దానిని కూకటి వేళ్లతో సహా పెళ్లగించినప్పుడే అభేద దృష్టి నలవరుచుకొని పురోగమిస్తాడు మానవుడు. ఆ నిర్మూలించే ప్రయత్నం ఇప్పుడుగాదు. పురాణకాలం నుంచీ జరుగుతూనే వస్తున్నది. భాగవత వివక్షితం వేరు కాబట్టి అందులో అంత బాహాటంగా మనకు కపడక పోవచ్చు. కాని హరి వంశాదులలో చూస్తే ఎంతగానో కనిపిస్తున్నది. శివ కేశవా భేదాన్ని ఎన్నో సన్నివేశాలలో ఎంతగానో గొంతెత్తి చాటాడు బాదరాయణుడు. అందుకోసమే కొన్ని భాగవతంలో లేని సన్నివేశాలు కూడా కల్పించాడు. అవి కూడా భాగవతమే గదా ఆ మాటకు వస్తే, చూడండి. మార్కండేయుడనే మహర్షి నోట ఇలా కొన్ని మాటలు పలికిస్తాడు హరివంశంలో.

  రుద్ర స్యపరమో విష్ణు - ర్విష్ణోశ్చ పరమః శివః ఏక ఏవద్విధాభూతో - లోకే చరతి నిత్యశః నవినా శంకరం విష్ణు - ర్న వినా కేశవమ్ శివః

  శివుడు లేని విష్ణువు లేడు. విష్ణువు లేని శివుడు లేడు. రెండూ ఒకే తత్త్వమట. అంతేకాదు.

  యథాం తరం నపశ్యామి - తేనతౌ దిశతః శివమ్

  రెంటికీ భేదం చూడనివారికే అది శుభకరమట. మరి ఈ శివుడెవరు, విష్ణువెవరు ఇద్దరికీ ఉన్న సంబంధమేమిటంటే బయటపెడుతున్నాడొక గొప్ప రహస్యం

Page 123

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు