జ్ఞానమవతరిస్తుంది. భాగవతం మోక్షఫలాన్ని ఎప్పుడందివ్వాలనుకొన్నదో అప్పుడు దానికి కావలసిన శ్రవణ మననాది రూపమైన జ్ఞానాన్ని ఉపదేశించి తీరాలి. ఇలాంటి జ్ఞానం రజస్తమో దూషితంగాని సత్త్వంవల్లగాని లభించదు. మరి ఆ సత్త్వానికి ప్రతీకమైన మూర్తి విష్ణువే. కనుకనే త్రిమూర్తులు ముగ్గూరూ సగుణులే అయినా విశుద్ధ సత్త్వగుణోపాధి అయిన విష్ణువుకే ప్రాధాన్యమిచ్చి వర్ణించవలసి వచ్చింది భాగవతం.
ఈ రహస్యం భాగవతమే విప్పి చెప్పింది మనకు. “పరమపూరుషుడొక్క డాద్యుడు పాలనోద్భవ నాశముల్ - సొరది జేయ ముకుంద పద్మజ శూలి సంజ్ఞల బ్రాకృత - స్ఫురిత సత్త్వరజస్తమంబుల బొందు నందు శుభ స్థితుల్ - హరిచరాచరకోటి కిచ్చు ననంత సత్త్వనిరూఢుడై" బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ ఈశ్వర స్వరూపులే. అయినా అందులో చరాచరాలకు శుభస్థితిని ప్రసాదించేది విష్ణువే నట. ఏమి కారణమంటే ఇస్తున్నాడు సమాధానం అనంత సత్త్వనిరూఢుడని. సత్త్వమంటే స్థితి. స్థితే లోకానికి కావలసింది. ఆద్యంతాలైన సృష్టి లయాలుకావు. లయమంటే చావు. సృష్టి అంటే చచ్చిన తరువాత మరలా జన్మా. ఈ రెండూ లేని దశే ఇక్కడ స్థితి అంటే. దీనికే బ్రాహ్మీస్థితి అని పేరు. దీన్ని సాధించటమే ముక్తి. దానికి సాధనం ఆత్మజ్ఞానం. అది సత్త్వం బాగా పరిశుద్ధమైనపుడే మానవుడికి లభిస్తుంది. అది ప్రసాదించేవాడు సత్త్వగుణోపాధి అయిన విష్ణువు. అలాంటి సత్త్వాన్ని ప్రతిపాదిస్తున్నది గనుకనే భాగవతానికి సాత్త్వత పురాణమని అసలు పేరు వచ్చింది. జ్ఞానప్రదాత అయిన విష్ణువు సాత్త్వతుడయితే తత్ప్రసాదంవల్ల జ్ఞానమార్జించి పరమపదాన్ని చేరవలసిన భక్తులు కూడా సాత్త్వతులే కాబట్టి ఇరువురికీ సంబంధించిన ఈ పురాణాన్ని సాత్త్వతమని పేర్కొన్నారు. పారమహంస్య సంహిత అని కూడా దీనికిందుకే పేరు వచ్చింది. పరమహంసలంటే జ్ఞానులే గదా. ఆ జ్ఞానం సత్త్వగుణ మూలకమే.
ఇదీ భాగవత పురాణం త్రిమూర్తులలో విష్ణుమూర్తికి ప్రాధాన్యమిచ్చి వర్ణించటంలో ఉన్న అంతరార్థం. రజస్తమో దూషితంగాని శుద్ధ సత్త్వాన్ని అలవరుచుకొని తన్మూలంగా జ్ఞానం సంపాదించి సంసార సాగరాన్ని పరీక్షిత్తులాగా మీరూ తరించండని మానవజాతికంతా చేసే ఉద్బోధ ఇది. అంతేగాని శివుడు
Page 122