ఇలాంటి లోకాంతర ప్రసక్తిగాని, శివుడనీ, విష్ణువనీ ఇలాటి దేవతా ప్రసక్తిగాని, ధ్యానమనీ యోగమనీ ఇలాటి అనుష్ఠాన ప్రసక్తిగాని, ఏ ఒక్కటీ లేదు. కేవల శ్రవణ మననాదుల వల్లనే సాధించవలసిన ఫలితమది.
పరీక్షిత్తు కోరింది. చివరకు సాధించింది ఇదే. భాగవత మాద్యంతాలు పరామర్శిస్తే ఈ సత్యమే మనకు ఋజువవుతుంది. ఆదిలో పరీక్షిత్తు ప్రశ్న వేసింది నాకు మోక్షమెలా ప్రాప్తిస్తుందో ఆ మార్గాన్ని బోధించమని. దాని కనుగుణంగానే సాగుతుంది శుకుడి భాగవత ప్రవచనమంతా. ఖట్వాంగుడి చరిత్ర నుదాహరించి గట్టిగా శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయాలే గాని అదెంత అని మొదలుపెట్టాడు తన బోధ. 12 స్కంధాల కథా వస్తువూ ఆ గమ్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన బోధే. చివరకన్నీ ముగిసిన తరువాత తన ఉపదేశ గీతానికంతటికీ ముక్తాయింపు ఇస్తూ “ఏవ మాత్మాన మాత్మస్థ మాత్మనైవామృశ ప్రభో - బుద్ధ్యానుమాన గర్భిణ్యా వాసుదేవాను చింతయా” అని సలహా ఇస్తాడు. బుద్ధి అంటే శ్రవణం అనుమానమంటే మననం - అను చింతనమంటే నిది ధ్యాసనం. ఈ భూమికాత్రయ రూపమైన జ్ఞానమే సాధనం తత్త్వాన్ని పట్టుకోటానికి. అది ఎక్కడో వైకుంఠాదులలో లేదు. ఏ విష్ణువో కాదు. శివుడో కాదు. అది నీ ఆత్మస్వరూపమే దాన్ని నీ ఆత్మతోనే అంటే ఈ అఖండాకార వృత్తితోనే ఆమృశ అను క్షణమూ పరామర్శించుకొంటూ పొమ్మంటాడు. దానితో ఏమవుతుంది.
అహమేవ పరం బ్రహ్మ - బ్రహ్మాహం పరమమ్ మతమ్ ఏవం సమీక్ష న్నాత్మాన - మాత్మన్యాధాయ నిష్కలే దశంతం తక్షకం పాదే లేలి హానం విషాననైః నద్రక్ష్యసి శరీరంచ విశ్వంచ పృథ గాత్మనః
ఈ విధంగా సకలమైన ఆత్మతత్త్వాన్ని నిష్కలమైన తత్త్వంలో ప్రవిలయం చేసుకొని అంతా నిరుపాధికంగా దర్శించావంటే ఇక తక్షకుడూ లేదు. కరవటమూ లేదు. నీకు విషమెక్కటమూ లేదు. చావటమూ లేదు. అంతా నీ స్వరూపంగానే మారి కనిపిస్తుంది. కాబట్టి చావు కూడా స్వరూపమే అయి "మృత్యూ నామ్ మృత్యు” వన్నట్టు నీవు మృత్యువుకే మృత్యువయి కూచుంటావని యమ ధైర్యమిస్తాడు. దానికి
Page 119