#


Index

విష్ణు పారమ్యము

మూలంగా సంహరిస్తుంది. అప్పుడదే శివుడు. అదే ఆయా వ్యాపారాల రీత్యా మూడు రూపాలు ధరించింది. కాబట్టి ఈ మూడింటిలో తేడాలేదు. మూడూ కూడా సగుణమే. సోపాధికమే. నిరుపాధిక మీ మూడింటికీ కూడా అతీతమయింది. దానిని భాగవత మిలా వర్ణిస్తుంది.

  నయత్ర సత్త్వమ్ నరజ స్తమశ్చ నవై వికారో నమహాన్ ప్రధానమ్ పరమ్ పదమే వైష్ణవ మామ నంతి సత్త్వం రజ స్తమ ఇతి గుణా బుద్ధే ర్నచాత్మనః

  ఇవి బుద్ధి కల్పితమే గాని ఆత్మకు లేవట. వదంతి యత్తత్త్వ విదః - తత్త్వం యద్ జ్ఞాన మవ్యయం - బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కథ్యతే- బ్రహ్మమూ పరమాత్మ భగవంతుడంటే అదే.

  ఈ భగవంతుండే భాగవత కథానాయకుడు. ఆయన మన మనుకొనే విష్ణుమూర్తి కాదు. ఆ విష్ణువు త్రిమూర్తులలో ఒకడు. సత్త్వగుణోపహితుడైన ఈశ్వరుడు. పోతే ఇది అగుణమైన తత్త్వం. "స వేదమ్ ససర్ణాగ్రే భగవానాత్మ మాయయా సదస ద్రూపయా చాపి గుణమయ్యా 2 గుణో విభుః" అగుణుడైనా సద సదాత్మిక అయిన తన మాయచేత సగుణుడైన ఈశ్వరుడుగా మారి ఈ ప్రపంచాన్ని ఆయనే సృష్టించాడు. అంతేకాదు. మనం విష్ణువు ధరించాడని భావించే మత్స్య కూర్మాద్యవతారాలు నిజంలో ధరించింది ఈ విష్ణువు కాదు. ఆ విష్ణువు. “యథా మత్స్యాది రూపాణి ధత్తే - జహ్యాద్యథా నటః - భూ భారః క్షపితో యేన జహేత్త చ్చ కళేబరమ్" ఆ ఆదినారాయణుడైన ఈశ్వరుడే ఈ అవతారాలన్నీ ఒక వేషధారిలాగా ధరించి తత్ప్రయోజనం తీరగానే మరలా విసర్జించి వెళ్లుతున్నాడు. కాబట్టి ఇంతకూ మనంగ్రహించవలసిన శాస్త్ర రహస్యమేమంటే స్వరూపతః భాగవతం వర్ణించే భగవత్తత్త్వం కేవల నిరుపాధికమైన బ్రహ్మమే పరమాత్మే. దానినే మరలా ఈ ప్రపంచ సృష్ట్యాదికాన్ని చేస్తున్నట్టు నిర్దేశించిందంటే అదే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే రజోగుణోపాధి అయి సృష్టి-సత్త్వోపాధి అయి స్థితీ - తమ ఉపాధి అయి లయమూ

Page 116

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు