స ఏవ సృజ్య స్సచ సర్గ కర్తా స ఏవ పాత్యత్తి చ పాల్యతే చ బ్రహ్మా ద్యవస్థాభి రశేష మూర్తిః
బ్రహ్మాదిమూర్తి త్రయంగా ప్రకాశించటమే గాక ఈ సృజ్య మానమైన సమస్త ప్రపంచం కూడా ఆ పరమాత్మేనట. సృజ్యమూ ఆయనే-సష్ట్రా ఆయనే. పాలించే వాడాయనే - పాలించబడేదీ ఆయనే. ఇది సరిగా పుడికి పుచ్చుకొనే అన్నాడేమో కాళిదాసు
త్వమేవ హవ్యం హోతాచ - భోజ్యం భోక్తాచ శాశ్వతః వేద్యంచ వేదితా చాసి - ధ్యాతా ధ్యేయంచ యత్పరమ్
అని తన కుమార సంభవంలో
దీనిని బట్టి వాస్తవంలో ఎవరికీ ఎవరూ తక్కువగాదు. ఎక్కువగాదు. అందరూ సరిసమానమే. అందరూ ఒకే తత్త్వం నుంచి వచ్చినప్పుడందులో వైషమ్యానికి తావే ముంది. సృష్టి స్థితిలయాలనే మూడు వ్యాపారాలు చేయటానికీ ముగ్గురు తయారయినారు. అందులో ఒకరు చేసే పని మరొకరు చేసేది గాదు. అలాంటప్పుడెవరెక్కువని ఎవరు తక్కువని. అయినా ఎక్కువ తక్కువలుగా పురాణాలు వర్ణించాయంటే దాని ఉద్దేశం వేరు. అది కేవల మాయా దేవతా మూర్తుల ఉపాసనార్థమే నని మనవి చేశాను. అందులో విష్ణువు నుపాసించమని వైష్ణవ పురాణాలు చెబితే శివోపాసన చేయమని స్కాందాది శైవ పురాణాలు చాటితే బ్రహ్మదేవుడి మహిమను బ్రాహ్మాది పురాణాలు ఘోషిస్తే వీరందరినీ త్రోసి రాజని కేవలమా దేవుడి మాయాశక్తి మాహాత్మ్యాన్ని బయట పెడుతాయి దేవీ భాగవతాదులు.
అయితే ప్రస్తుతం నేను చెప్పదలచింది ఇది కూడా కాదు. భాగవతమిలాటి ఒక వైష్ణవ పురాణంగా భావించి దాన్ని సమర్ధించబూనటం లేదు నేను. ఉపాసనా ప్రయోజనాన్ని ఉద్దేశించి వెలువడిందే అయితే అలా సమర్థించినా ఒక సబబే. కాని ఉపాసన కోసం కాదది. కేవలం తత్త్వజిజ్ఞాసువులైన మానవులకు జ్ఞాన మార్గాన్ని ఉపదేశించటమే దాని ఏకైక ప్రయోజనం. అందుకోసమే అసలది అవతరించింది. జ్ఞానం ప్రధానమైతే ఉపాసనాదులానుషంగికం దానికి. మన దురదృష్టం కొద్దీ కొందరు
Page 112