#


Index

విష్ణు పారమ్యము

ఇలాటివెన్నో వైషమ్యాలు కనిపిస్తాయి కథలలో. విష్ణు మాహాత్మ్యాన్ని చాటటానికి వైష్ణవ పురాణాలు ప్రయత్నిస్తే- శివపారమ్యాన్ని నిరూపిస్తాయి శైవ పురాణాలు. ప్రత్యక్షంగానే విష్ణువూ బ్రహ్మా ఇద్దరూ శివతత్వాన్ని కనుక్కోలేక ప్రాకృత జనుల మాదిరి బేలలయిపోయిన ఒకానొక వృత్తాంతాన్ని స్కాందలైంగాదు లెంతగానో చాటుతాయి. అదేమిటంటే శివలింగం పెరిగిపోయి బ్రహ్మాండంగా వ్యాపిస్తుందీ బ్రహ్మాండాన్నంతటినీ, దాని కొనా మొదలేదో తెలుసుకొని వస్తామని దేవతలకు హామీ ఇచ్చి బయలుదేరుతారు బ్రహ్మవిష్ణులు. ఒకరు పైకి ఒకరు క్రిందికీ ప్రయాణం చేసి పోయి పోయి ఎంత దూరమలాపోయినా దాని అంతూ ఆకాశం చూడలేక పోయారు. బిక్కమొగం వేసుకొని వెళ్లిన దారినే మళ్ళీ తిరిగి వచ్చారు. దేవతలేమి చేసి వచ్చారని ఆత్రంగా ప్రశ్నిస్తారు. నాకేమి అర్థం కాలేదని నిజాయితీగా చెప్పి ఊరుకొంటాడు నారాయణుడు. బ్రహ్మ అందులో కూడా కొంత తిరకాసు చేసి శాపం ఒకటి నెత్తికి తెచ్చుకొంటాడు. చూడండి. మరి ఈ సన్నివేశానికేమి చెబుతారు జవాబు.

  కాబట్టి పురాణాలూ అవి చెప్పే కథలూ మాత్రమే ఆలకిస్తూ పోతే ఏదీ నిర్ణయించలేము. అటెంతో ఇటూ అంతగానే మొగ్గు చూపవలసి వస్తుంది. కొన్ని శివుణ్ణి తక్కువ చేసి చూపితే మరికొన్ని విష్ణువును కించపరిచి వర్ణిస్తాయి. బ్రహ్మను కొంచెం తగ్గించి మాటాడినా అది కొంత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు దేవుని నాభికమలంలో నుంచి జన్మించినట్టు అన్ని పురాణాలూ అంగీకరించాయి. ఆయన అనుగ్రహంవల్లనే ప్రపంచ సృష్ట్యాదికం చేయగలిగాడని కూడా ఉంది. కాబట్టి ఆయనతో సమానమైన ప్రతిపత్తిలేదని వర్ణించినా అందులో అంత ఆశ్చర్యం లేదు. కాని శివుణ్ణి కూడా తగ్గించి చూపటంలో ఏ మాత్రమూ సబబు కనిపించలేదు. అయితే ఎందుకిలాటి పరస్పర ద్వేష కారణాలైన వర్ణనలని అడగవచ్చు. పరస్పర ద్వేషానికి కాదిది. ఉపాసకుల సౌకర్యానికని చెబుతారు శాస్త్రజ్ఞులు. జ్ఞానం వేరు, ఉపాసన వేరు. జ్ఞానమంటే భగవత్తత్త్వాన్ని ఉన్నదున్నట్టు తెలుసుకోవటం. ఎలా ఉన్న దాతత్త్వం. ఏ నామమూ, ఏ రూపమూ లేని ఎలాటి భేదమూ కానరాని సర్వవ్యాపకమై సర్వానన్యమై సర్వాత్మకమైన శుద్ధ చైతన్యం. అది ఇక విష్ణువా శివుడా చతుర్ముఖుడా అని ప్రశ్న లేదు. ఏదీ కాదది. ఏదీ కానిదదే. అన్నీ అయినదదే. దాని నలాగే పట్టుకొని అనుభవానికి తెచ్చుకొంటే అది జ్ఞానం. అయితే ఎందరికుంటుందీ

Page 109

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు