ప్రతిష్ఠాపన
"సర్వమున్నతని దివ్య కళామయ"మన్నట్టు సర్వ ప్రపంచంతోపాటు సర్వ సాహిత్య సామగ్రి దాని వివిధ రూపాలే. అదే ఆయా కథలుగా పాత్రలుగా సుఖదుఃఖాదిభావాలుగా అవతారమెత్తి మనకనేక భంగిమలలో అక్షర రూపంగా సాక్షాత్కరిస్తున్నది. అంతా తదాత్మకమే తన్మయమే.
ఇది ఏమిటి ఎలాగా అని ఆశ్చర్యపోనక్కరలేదు. అమూర్తమైన కవి భావనే మూర్తీభవిస్తే గదా దాన్ని కావ్యమన్నారు. అమూర్త దశలో అది ఒక భావం. కేవలమతని దృష్టే అది. ఆ దృష్టితో అతడు సృష్టి చేస్తాడు. అయితే అతడికి బాహ్యంగా ఒక ప్రపంచమంటూ ఉంది కాబట్టి అందులోని వ్యక్తులకూ, వారి భావాలకూ, జీవితాలకూ, ప్రతిరూపంగా ఒక శాబ్దికమైన చిత్రాన్ని నిర్మించుకొంటాడు. అది తనకు కలిగిన భావనా లేక దృష్టిని బట్టి రూపుదిద్దుకొంటుంది. అందుకే చెప్పారు మన అలంకారికులు “అపారే కావ్య సంసారే, కవిరేవ ప్రజాపతిః యథాస్మైరోచతే విశ్వమ్, తథేదమ్ పరివర్తతే" అని ప్రపంచానికి సృష్టికర్త పరమేష్ఠి ఒకడెలా ఉన్నాడో అలాగే కావ్య ప్రపంచానికి కూడా ఒకడున్నాడు సృష్టికర్త. వాడే కవి. పోతే ఆ సృష్టికర్త ఇచ్ఛానుసారంగా ఆ సృష్టి ఎలా జరిగిందో ఈ కవి అనే సృష్టికర్త భావానికనుగుణంగా ఈ కావ్యసృష్టి కూడా చిత్ర విచిత్రంగా పరిణమిస్తుందట.
సరిగా ఇది "మయాధ్యక్షేణ ప్రకృతి, సూయతే సచరాచరమ్, హేతునా 2 నేన కౌంతేయ జగద్విపరివర్తతే" అనే గీతా శ్లోకానికి తోబుట్టువుగా కనిపిస్తున్నది. అక్కడా పరివర్తతే ఇక్కడా పరివర్తతే అని ఒకే క్రియా పదం ప్రయోగించబడింది. ప్రకృతి అనేది పారమేశ్వరమైన శక్తి. పరమేశ్వరుడు స్వరూపతః ఉదాసీనుడే అయినా, తన ఇచ్ఛాశక్తిని బట్టి ఈ జగత్తునంతా సృష్టి చేస్తాడు. అది ఆయన సంకల్పానికనుగుణంగా నడుస్తూ పోతుందట. అలాగే సాహిత్య జగద్వ్యవహారం కూడా కవి భావనా శక్తి కనుగుణంగానే సాగుతుంది. అయితే ఒక్కటే తేడా దానికీ దీనికీ. అదేమిటంటే పరమేశ్వరుడు నిర్మించిన ఈ భౌతిక జగత్తు "నిరుపాదాన సంభార, మభిత్తావేవ తన్వతే" అన్నట్టు ఏ సామగ్రీ చేతికి తీసుకోకుండా ఏ ఆధారమూ లేకుండానే నిర్మించాడు. పోతే సాహిత్య జగద్విషయమలా కాదు. లోకంలో సిద్ధంగా ఉన్న వస్తు సామగ్రిని చూచి దాని సహాయంతో
Page 10