#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

లోకంలో చూస్తున్నామో అదంతా నిజానికి వీటి కాధార భూతమైన చైతన్య శక్తి చేత నిండి నిబిడీ కృతమైనదే. ఈ మూర్తి కేవలమా స్ఫూర్తే నని భావిస్తూ పోతే- అవరంగా చూచేదంతా పరంగానే మరలా అనుసంధానమౌతుంది. అమూర్తమే మూర్తమనీ – మూర్తమే అమూర్తమనీ రెంటికీ తేడా లేకుండా ఏక రూపంగానే అనుభవానికి వస్తుంది. ఈ భావాన్నే సూచిస్తున్నదీ పరావర అనే నామం. పర మవరం రెండూ దేవీ స్వరూపమేనని భావం.

  ఎటు వచ్చీ అలాటి అనుసంధానం చేయగలిగి ఉండాలి సాధకుడు. నిత్యమూ మనమీ ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాము. అందులో మూర్తమైన ఇండ్లూ వాకిండ్లనే కాదు. వాటితోపాటు మరొక అమూర్తమైన పదార్థాన్ని కూడా దర్శిస్తున్నాము. అదేదో కాదు. ఆకాశం. అది ఈ మూర్తమైన వస్తువులన్నింటి లోపలా వెలపలా కూడా వ్యాపించి ఉంది. చిత్రమేమంటే వ్యక్తమైన వీటినెలా చూస్తున్నామో - వాటిని చుట్టి ఉన్న అవ్యక్తమైన ఆకాశాన్ని కూడా చూస్తూనే ఉన్నాము. రెండూ మన దృష్టికి విషయ మౌతున్నాయి. రెండింటినీ ఒక్క మారే గ్రహిస్తున్నాము. కాని రెంటినీ కలిపి సమన్వ యించుకోలేక పోతున్నాము. కేవల మిది వస్తువూ అది ఖాళీ అని విడి విడిగా చూస్తాము అలాగాక ఖాళీయే అక్కడక్కడా ఘనీభవించి ఆయా వస్తువుల రూపంలో కనిపిస్తున్నదని దర్శించ గలిగితే అదే పరా వర దర్శనం. దర్శించ గలడు మానవుదు. కాని రామాయణంలో హనుమంతుడి లాగా తన శక్తినే తాను మరచి పోతున్నాడు.

  కనుక అవధానపరుడైన వాడికీ ప్రక్రియ చాలా సుకరమైనది. సుసుఖం కర్తుమని భగవానుడే సెలవిచ్చాడు గదా. దీనినిబట్టి ఎవడు

Page 97

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు