#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

జ్ఞాన దృష్టికి అంతా శివ స్వరూపమే. కనుక జ్ఞానాజ్ఞానాలలోనే అంతా సమసి పోతున్నది. మరి ఈ అజ్ఞాన మెక్కడిది అని అడిగితే ఆ ప్రశ్నే అసలు అజ్ఞాన జన్యం. కనుక ప్రశ్న వేసే ప్రయాస కూడా వదిలేసి ఉన్నదంతా నేననే స్పూర్తితో నిలిచి ఉండటమే పరమార్ధమని ఈ అద్వైత విద్య మనకు చేసే బోధ.

  ఈ ప్రకారంగా అన్ని ప్రశ్న లకూ సమాధాన మిచ్చేది కాబట్టి ఈ విద్య అన్నింటికీ మహత్తర మైనది. మహతీ విద్యా మహా విద్యా. మహత్తరమైన ఈ విద్యే ఆ దేవి స్వరూపం గనుక ఆవిడకు మహా విద్యా అనే పేరు సార్థకం. బ్రహ్మ విద్యా- తత్త్వ విద్యా- అధ్యాత్మ విద్యా- శుద్ధ విద్యా-మోక్ష విద్యా అని ఈ విద్యకే నామాంతరాలు. ఇరాంటి అభేద విద్యను సద్గురువైన వాడు తన శిష్యుడికి చక్కగా సాకల్యంగా బోధిస్తే శిష్యుడది అందుకొని తరిస్తాడు గనుక ఇది ఒక సంప్రదాయమైంది లోకంలో.

20. బ్రహ్మత్మైక్య స్వరూపిణీ
21. తత్త్వమర్థస్వరూపిణీ

  ఐతే గురువు గారు ఈ మహా విద్యను ఎలా ఉపదేసిస్తారు-వారుపదేశించే ఈ విద్యా స్వరూప మేమిటని ఇప్పుడు వివరిస్తున్నాయి ఈ రెండు నామాలు. మొదట బ్రహ్మాత్మైక్య మనేది విద్యా స్వరూపాన్ని మనకు ప్రతిపాదిస్తున్నది. బ్రహ్మమంటే బృహత్తమమైన పదార్థం. బృహత్తమమైతే అది దేశ కాల వస్తువులను మూడింటినీ వ్యాపిస్తుంది. అలాంటి వ్యాపకమైన వస్తువు చైతన్యం తప్ప వేరొకటి కావటానికి వీలు లేదు. ఎందుకంటే అది కూడా చైతన్యంచేత గ్రహించబడ వలసిందే. గ్రహించేదే చైతన్యం. ఆ గ్రహించే స్వభావం ఉన్నది నేననే స్ఫురణ ఒక్కటే. ఈ నేననే

Page 91

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు