ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
బుద్ధి వికాసానికి నోచుకోమనీ- అది నంకుచితమైపోతుందనీ– సాధకుడు భయపడ నక్కర లేదు. మీదు మిక్కిలి ఆ గురువు బోధించేది కేవల అద్వైత భావమే గనుక దురభిమానం వదలి పెట్టి అలాంటి వాణ్ణి ఆశ్రయించటమే మనకు మేలు. అపరోక్ష జ్ఞాన మార్జించినవాడు గనుక ఆయన సాక్షాత్తు శివ స్వరూపుడే.
19. మహా విద్యా
సరే. అలాంటి గురువు మనకు బోధించే ఆ విద్య ఏమిటి. దాని నామ ధేయమేమిటని మరలా ప్రశ్న. మహా విద్యా అని దానికి సమాధానం. వేద్యతే అనయా ఇతి విద్యా. వేద్య మైన విషయం దేని ద్వారా గ్రహిస్తామో అది విద్య. ఇలాంటి విద్యలీ లోకంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నా అవన్నీ ద్వైత విషయాలే. అది లోక విద్యే కావచ్చు. కర్మ విద్యే కావచ్చు. మంత్ర విద్యేకావచ్చు. యోగ విద్యే గావచ్చు. తంత్రోపాసనాదులే కావచ్చు. ఏ దైనా సరే. ప్రతి ఒక్కటీ వేద్యమైన విషయాన్ని వేదిత అయిన మానవుడికి వేరుగానే చూపుతుంటుంది. వేదితా వేద్యం వేదనమనే త్రిపుటి అనివార్యంగా చోటుచేసుకొనే ఉంటుంది. మూడింటినీ సంపుటీకరించి మూడూ నీ స్వరూపమేనని ఏదీ మనకు బోధించలేదు.
అలా బోధించగలిగిన విద్య ఒక్కటే. అది అద్వైత విద్య. అది ఈ త్రిపుటిని వాస్తవంకాదని కొట్టివేస్తుంది. వాస్తవమైనది శివ స్వరూపమైన ఆత్మ ఒక్కటే. దానికి వేరుగా ఏది ప్రతీతమౌతున్నదో అది ప్రతీతి మాత్రమే. అది కూడా ఆ శివ చైతన్యమే అలా ప్రతీయమాన మౌతున్నది. అజ్ఞాన దృష్టికే అది.
Page 90