పూర్వార్ధము - అవరోహణ క్రమము
రెండింటి నడుమ మెలగుతున్నందు వల్ల కూడా దీనిని మధ్యమ అని పేర్కొన వచ్చు. ఈ దశలో నామారూపాత్మకమయిన సృష్టి అంతా ఇంకా స్పష్టంగా బయట పడలేదు. అతి సూక్ష్మ రూపంగానే వర్తిస్తుంది. అందుకే దీనికి ముకుళితావస్థ అని పేరు పెట్టారు తాంత్రికులు.
ఈ ముకుళితావస్థే క్రమంగా వికస్వరమయ్యే సరికి అది వైఖరీ రూపంగా మారుతుంది. ఇది ఆ పరాభట్టారిక నాలుగవ భూమిక. విశేషేణ ఖరా విఖరా- విఖరైవ వైఖరీ. విశేషంగా కఠినమైనదేదో అది వైఖరి. పృథివ్యాదిక మైన ఈ జడ ప్రపంచమంతా స్థూలంగా కఠినంగా కనపడుతూ ఉంది మనకు. ఇదే వైఖరి అంటే. శక్తి తాలూకు అతి స్థూలమైన అవస్థ ఇది. అతి సూక్ష్మ పర అయితే అతి స్థూల వైఖరి. ఎక్కడే గాని ఇదే వరస. సృష్టి ఎప్పుడూ సూక్ష్మంలో మొదలయి స్థూలంతో ముగుస్తుంది. ఇందులో అతి సూక్ష్మ పరి. కొంత సూక్ష్మ పశ్యంతి. కొంత స్థూల మధ్యమ. అతి స్థూల వైఖరి. ఇలా ఉత్తరోత్తరం అవ్యక్త మయిన దశ నుంచి వ్యక్తమైన దశ వరకు ప్రయాణిస్తున్నదాశక్తి.
21. తత్త్వాధికా - తత్త్వమయీ
అవ్యక్త వ్యక్త అని రెండు వర్గాలుగా పరిగణించినప్పటికి వస్తుతః అది రెండుగాదా శక్తి. పర మొదలు కొని వైఖరి వరకు కనిపించే అన్ని భూమికలలోనూ ఆ పరా భట్టారికే దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. భూమికలు మాత్రమే ఇవన్నీ ఆవిడకు. వీటి మూలంగా ఆవిడ స్వరూపానికెప్పుడూ ముప్పు లేదు. అసలు
Page 38