#


Index

పూర్వార్ధము - అవరోహణ క్రమము

దానికి విశేషణమే ప్రత్యక్ అని చితిరూపమని. చిదేక రస రూపిణి అనిగదా ముందు పేర్కొన బడింది . ఆ చిత్తు ఎప్పుడూ ప్రత్యగ్రూపమే. పరాగ్రూపం కాదు. పరాగ్రూపమైతే అది విషయకోటిలో చేరిపోతుంది. విషయం కాదది . నరూపం గనుక ఎప్పుడూ విషయి గానే ఉంటుంది. ఇలాంటి చైతన్యమాత్ర స్వభావమైన శక్తికి పరా అని పేరు. దానికి పరంగా మరే దశా లేదు.

  ఇలాంటి పర పరమశివునితో కలిసి ఉన్నంత వరకూ ఒక స్పందనమని గాని సృష్టి అని గాని ఎరగదు. అది సృష్టించాలని సంకల్పిస్తే దానికనుగుణంగా ఒక స్పందన ఏర్పడుతుంది. ఈ స్పందించే దశనే పశ్యంతి అని పేర్కొన్నారు. పశ్యంతి అనగా ఈక్షణ మని ఇచ్ఛాకారిణి అని అర్థం. ఈ ఇచ్ఛా శక్తే ఆ దేవి రెండవ దశ. పర జ్ఞానమయితే ఇది ఇచ్చ. లౌకికమైన న్యాయాన్ని బట్టి చూచినా ఇది మనకు బోధపడుతుంది. లోకంలో ఒక మానవుడు ఏదైనా ఒకటి సంకల్పించే ముందు నిశ్చలమైన మనసుతో ఉంటాడు. అతడేదైనా ఒకటి కోరితే నిశ్చలమైన ఆ మనసులో ఇచ్ఛారూపమైన ఒక చలనమేర్పడుతుంది. అలాగే ఆ భగవతి సంకల్పించనంత వరకూ పరిగా ఉండి సంకల్పం చేసే సరికి పర పశ్యంతి గా మారుతున్నది.

19. మధ్యమా 20. వైఖరీ రూపా

  పశ్యంతి తరువాత మధ్యమ అనేది మూడవ భూమిక. రెండు నాలుగు భూమికలకు మధ్యలో వస్తుంది గనుక దీనికి మధ్యమ అని పేరు వచ్చింది. ఇచ్చా రూపిణి అయిన శక్తి ఫలభాగిని కావాలంటే క్రియారూపాన్ని ధరించాలి గదా. ఈ ఇచ్ఛా క్రియలు

Page 37

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు