పూర్వార్ధము - అవరోహణ క్రమము
జాతులకు లెక్క లేదు. అంతే కాక పశుపక్షి సరీసృపాదులు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని పరిగణించలేము. అందులోనూ ప్రతిఒక్క జీవికీ మనసులో ఎన్ని ఆలోచనలో ఎన్ని మాటలో ఎన్ని శారీరకమైన చేష్టలో వర్ణించి చెప్పటానికి బ్రహ్మకు సాధ్యంకాదు. ఈ విధంగా ఇంత గొప్ప జడ చేతనాత్మకమైన సృష్టి వ్యాపారాన్ని సాగిస్తున్నదంటే ఆ మహా శక్తి ఎంత మహిమాన్వితో వేరుగా చెప్ప బనిలేదు. అంతే కాదు. సృష్టికి పూర్వం ఈ జడ చేతన ప్రపంచమంతా ఎక్కడో కాదు. ఆ మహా శక్తి గర్భంలోనే గుప్తమయి ఉన్నదట. విశ్వ గర్భా, స్వర్ణ గర్భా అని సహస్ర నామాలలో రెండు నామాలు దీనినే బయటపెడుతున్నాయి. విశ్వమంటే జడ ప్రపంచం. స్వర్ణ మంటే హిరణ్యగర్భుడికి పర్యాయమైన చేతన ప్రపంచం. ఈ రెండూ ఆవిడ గర్భంలో ఉన్నాయంటే అప్పుడది అవ్యక్తంగా ఉన్న శక్తి మాత్రమే. అదే సృష్టి చేయాలని ఎప్పుడు ఉన్ముఖమయిందో అవ్యక్తమయిన దశను విడిచి వ్యక్తమయిన జడచేతన రూపంగా పరిణమిస్తుంది. అలా పరిణమించినా కూడా ఈ వ్యక్తమయిన రూపం మరేదో కాదు. అవ్యక్తమయిన ఆ శక్తి రూపమే. అంతేగాదు. అవ్యక్తదశలోనే గాక వ్యక్త దశలో కూడా ఈ చేతనాచేతన జగత్తు ఆవిడ గర్భవాసంలోనే ఉంది. ఆ పరిధి దాటి ఎక్కడా అడుగు పెట్టలేదు.
17. పరా- ప్రత్యక్చితీ రూపా
18. పశ్యంతీ - పరదేవతా
కావచ్చు. కాని ఆ దేవి అవ్యక్త గదా. అవ్యక్త అయిన శక్తి మరలా వ్యక్త మయిన దశను ఎలా పొందగలిగింది. ఆ మార్గమిప్పుడు వివరించబడుతున్నది. అవ్యక్తమయిన శక్తి వ్యక్తంగా మారటంలో నాలుగు భూమిక లేర్పడుతున్నాయి. మొదటిది పర.
Page 36